సర్కారు వారి పాట మొదటి సాంగ్ రెడీ.. కళావతి ప్రేమలో పడేందుకు సిద్దమేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా అభిమానులను ఎంతగానో ఊరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాది నుంచి వాయిదా పడుతున్న ఈ సినిమా మొత్తానికి సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. మే 12వ తేదీన వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇక సినిమా విడుదల తేది ఫిక్స్ చేసుకున్న తరువాతనే పాటలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. ఇక మొత్తానికి ఫైనల్ డేట్ ఫిక్స్ కావడంతో ఇక నుంచి రెగ్యులర్ గా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాలని చిత్ర యూనిట్ సభ్యులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక సినిమాకు సంబంధించిన మొదటి పాటను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు.

గీత గోవిందం సినిమా తో బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సూపర్ స్టార్ రేంజ్ కు తగ్గట్టుగానే సినిమాను నిర్మిస్తోంది. గతంలోనే మహేష్ తో ఈ సంస్థ శ్రీమంతుడు సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం సంగీత సంచలనంగా మారుతున్నా తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి మొదటి పాటను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 14న వాలెంటెన్స్ డే సందర్భంగా సర్కార్ వారి పాటకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ విడుదల కానుంది.

Sarkaru vaari paata first single kalaavathi on February 14

ఇక వాలంటైన్స్ డే కు తగ్గట్టుగానే ఆ పాటను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. తమన్ లవ్ సాంగ్స్ ను ఎంత చక్కగా కంపోజింగ్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ పాట కోసం కూడా చాలా రోజులు కష్టపడి రెడీ చేశాడట. సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ కళావతి అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక కళావతి ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి అంటూ ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. హీరో హీరోయిన్ ప్రేమను హైలెట్ చేసే విధంగా ఈ పాటను రూపొందించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలి అంటే ముందుగా ఆడియో సక్సెస్ అవ్వాలని అందుకే సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా థమన్ చాలా కష్టపడి సంగీతం అందించినట్లు తెలుస్తోంది. దర్శకుడు పరశురామ్ కూడా గతంలో ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో మ్యూజిక్ హైలెట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. ఇక సర్కారు వారి పాట లో మహేష్ బాబు కీర్తి సురేష్ కాంబినేషన్ కాబట్టి అంతకుమించి అనేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాను మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X