సర్కారు వారి పాట ఇన్ సైడ్ టాక్.. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్.. పండగేనట!

సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉన్నా కరోనా కారణంగా సినిమా షూటింగ్ లేట్ గా మొదలయింది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇన్ సైడ్ టాక్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఒక యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆమె ఏమంది ? సర్కారు వారి పాట సినిమా ఎలా ఉండబోతోంది అనేది చూస్తే

సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో

బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మహేష్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొదలు కాకముందే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ సినిమాలో మహేష్ ప్రీ లుక్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. మహేష్ మెడ మీద రూపాయి గుర్తుతో ఉన్న టాటూ, మహేష్ జూలపాల లుక్ సినిమా మీద ఆసక్తి పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పండుగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్

పండుగ చేసుకుంటున్న మహేష్ ఫ్యాన్స్

అయితే తాజాగా ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఒక యువతి ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె కామెంట్స్ తో మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు.

ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని సదరు యువతి పేర్కొంది. అలాగే దుబాయ్ షెడ్యూల్ అద్భుతంగా వచ్చిందని ఆమె కామెంట్స్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి పోయారు.

కరోనాతో సెకండ్ షెడ్యూల్ వాయిదా

కరోనాతో సెకండ్ షెడ్యూల్ వాయిదా

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ దుబాయ్ లో జరిగింది.. ఇక హైదరాబాద్ లో షూటింగ్ చేయాల్సి ఉంది. వాస్తవానికి వారం రోజుల క్రితం సర్కారు వారి పాట రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.

హైదరాబాద్ శివార్లలో ఉన్న శంకరపల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇరవై రోజుల పాటు ప్లాన్ చేసి షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నాక హైదరాబాద్ సహా తెలంగాణ మొత్తం మీద కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా సినిమా షూటింగ్ బ్రేక్ లు పడ్డాయి. ఆ సినిమా షూటింగ్ ను ఆపేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

చెప్పిన డేట్ కు వస్తుందా?

చెప్పిన డేట్ కు వస్తుందా?

భారతదేశంలో జరిగిన బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కు సంబంధించి ఈ కథ రాసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా మహేష్ తో కీర్తి సురేష్ కలిసి నటిస్తోంది.. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో కనిపిస్తున్న మలయాళ నటుడు జయరామ్ మహేష్ బాబు తండ్రి గా నటిస్తున్నట్టు సమాచారం. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది.. అయితే కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా షూటింగ్ లు క్యాన్సిల్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X