అఖిల్ గుర్రపు స్వారీ.. మిస్టర్ మజ్ను తరువాత ఈ చిత్రమే!
అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. మిస్టర్ మజ్నుగా అఖిల్ మూడవ చిత్రం తెరకెక్కుతోంది. అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో మూడవ చిత్రంపై అఖిల్ దృష్టి పెట్టాడు. తొలి ప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు.
అఖిల్ నాల్గవ చిత్రానికి సంభందించిన ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. హీరో ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ పినిశెట్టి ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. అఖిల్ కోసం సత్య ప్రభాస్ ఆసక్తికరమైన కథని రూపొందించాడట. కథ చర్చలు పూర్తయ్యాయని అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని అంటున్నారు.

ఈ చిత్రంలో అఖిల్ గుర్రపు స్వారీ చేసే జాకీ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అఖిల్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా దర్శకుడు కథ రూపొందించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











