‘6 రోజులకే ఆ సినిమా ఓటీటీలోకి... అభిమాని మెసేజ్‌తో నా హృదయం ముక్కలు’

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా దూసుకెళ్తున్నారు సత్యదేవ్. రోటీన్ సినిమాలు కాకుండా వెరైటీ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సత్యదేవ్. చిన్నా చితకా పాత్రలు చేస్తూ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సమవర్తి, రావు బహదూర్ సినిమాలలో నటిస్తున్న సత్యదేవ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్, వ్యక్తిగత జీవితం, సినీ పరిశ్రమలో కష్టాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సత్యదేవ్. ఈ వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నానికి చెందిన సత్యదేవ్ .. తొలుత ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్‌లో ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిశారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మైనే ప్యార్ కియా, ముకుంద, అసుర, క్షణం, అప్పట్లో ఒకడుండేవాడు, ఘాజీ, రోగ్ తదితర సినిమాలలో చిన్నాచితకా పాత్రలు పోషించారు సత్యదేవ్. ఈ దశలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ మూవీ ఆయనకు బ్రేక్ ఇచ్చింది. అనంతరం వచ్చిన బ్లఫ్ మాస్టర్ సత్యదేవ్‌కు టాలీవుడ్‌లో సుస్ధిర స్థానాన్ని కల్పించింది.

Satyadev Emotional on Krishnamma Movie Result and Early OTT Streaming

తర్వాత బ్రోచేవారెవరురా, రాగల 24 గంటల్లో, 47 డేస్, ఉమాశంకర ఉగ్ర రూపస్య, గువ్వా గోరింకా, తిమ్మరుసు, స్కైలాబ్, గాడ్సే, గాడ్‌ఫాదర్, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, జీబ్రా, కింగ్డమ్, డ్రైవ్ తదితర సినిమాలతో విలక్షణ నటుడిగా స్థానం సంపాదించుకున్నారు సత్యదేవ్. ప్రస్తుతం రావ్ బహదూర్, ఫుల్ బాటిల్, గరుడ: చాప్టర్ 1, సమవర్తి సినిమాలలో ఆయన నటిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యదేవ్ మాట్లాడుతూ.. తనకు ఎంతో ఇష్టమైన కృష్ణమ్మ సినిమా రిజల్ట్స్‌పై ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణమ్మ సినిమాకు కొరటాల శివగారు ప్రొడ్యూసర్. అది చాలా పెద్ద ఫ్రైడే అవ్వాలి. కానీ శుక్రవారం రిలీజై.. గురువారం కల్లా ఓటీటీలోకి వచ్చేసింది. మేకర్స్ అలా మాట్లాడుకున్నట్లుగా ఉన్నారు ఈ విషయం నాకు తెలియదు. కృష్ణమ్మ సినిమా .. నా కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. చాలా తక్కువ మంది కృష్ణమ్మ సినిమాను చూసుంటారు. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్న దశలో ఎన్నికలు వచ్చాయి. ఎలక్షన్స్ హై హీట్‌లో ఉన్నాయి. ఆ టైంలో రిలీజ్ చేశారు. ఎన్నికలకు ఒక రోజు, కర్ఫ్యూల వల్ల మరో రోజు పోయింది. ఆ వెంటనే గురువారం ఓటీటీలోకి వచ్చేసింది. ఆరు రోజుల్లోనే కృష్ణమ్మ ఓటీటీలోకి వస్తుందని చిన్న క్లూ కూడా నాకు తెలియదు. ఆ మూడు నాలుగు రోజులకే పెట్టిన డబ్బులు వచ్చేశాయి.

నేనేమో కృష్ణమ్మ సినిమా బాగా ఆడుతోంది, థియేటర్‌లో చూడమని పోస్టులు పెడుతుంటే .. ఒక అభిమాని మెసేజ్ పెట్టాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నా.. వెధవల్లా కనిపిస్తున్నామా, వెళ్లి ఓటీటీలో చూసుకో, కామెడీ చేస్తున్నావా అని స్క్రీన్ షాట్ పెట్టాడు. ఎందుకన్నా అలా మాట్లాడుతున్నావు నాకు డబ్బులు బొక్క అని ఫైర్ అయ్యాడు. ఆ మాటలతో నాకు హార్డ్ బ్రేక్ అయిపోయింది. శుక్రవారం ఖచ్చితంగా నా సినిమా జనాల్లోకి వెళ్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న ప్రతిసారి అది రాంగ్ అవుతోంది. నేనొక్కడినే కాదు.. ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. నా ప్రతి సినిమా తక్కువలో తక్కువ రెండేళ్లు పట్టేది. తిమ్మరుసు మాత్రం త్వరగానే వచ్చేసింది. ఒక్క శుక్రవారం కోసం రెండేళ్ల పాటు ఒక సినిమాను పట్టుకుని వెయిట్ చేయాలి. కానీ ఏం చేస్తాం.. హార్ట్ బ్రేక్ అవుతుంది, కూర్చొంటాం.. ఏడుస్తాం, బాధపడతాం. కాన్ఫిడెన్స్, గోల్స్ అన్ని గుర్తుతెచ్చుకుని మళ్లీ వార్ స్టార్ట్. సినిమా ఇండస్ట్రీ అనేది ఓపెన్ యూనివర్సిటీ. ఎవరైనా రావొచ్చు.. టాలెంట్ ప్రూవ్ చేసుకోవచ్చు. ఎవరైనా కొట్టొచ్చు.. సక్సెస్ రేటు కూడా తక్కువగా ఉంటుంది అని సత్యదేవ్ ఎమోషనల్ అయ్యారు.

Read more about: satyadev krishnamma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X