చిరంజీవి మాటే ఫైనల్.. రూ.100 కోట్ల ఆఫర్‌ వదులుకున్న సత్యదేవ్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సత్యదేవ్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు సత్యదేవ్. తన నటనతో మెప్పించి హీరోగా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. 'జ్యోతిలక్ష్మి', 'బ్లఫ్ మాస్టర్', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య', 'గుర్తుందా శీతాకాలం', 'కృష్ణమ్మ' వంటి సినిమాలతో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తన నటనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే విమర్శకుల ప్రశంసలు దక్కినా, కమర్షియల్ పరంగా మాత్రం ఇప్పటివరకు ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు.

ప్రస్తుతం ఆయన 'రావు బహదూర్' సినిమా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సత్యదేవ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం, కెరీర్ నిర్ణయాలు, మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రూ.100 కోట్ల ఆఫర్‌ను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Satyadev Reveals Why He Turned Down a 100 Crore Offer After Chiranjeevi s Career Advice

ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. సత్యదేవ్‌ను ప్రశ్నిస్తూ.. 'గాడ్ ఫాదర్' సినిమా తర్వాత ఓ పాన్ ఇండియా స్టార్ సినిమాలో విలన్ పాత్రకు భారీ ఆఫర్ వచ్చిందని, కానీ దాన్ని తిరస్కరించారనే వార్తల్లో నిజమెంత?' అని ప్రశ్నించారు. దీని సత్యదేవ్ సమాధానమిస్తూ.. 'అవును నిజమే.. ఆ పాత్ర చాలా బాగుంది. వాళ్లు ఇవ్వాలనుకున్న పారితోషికం కూడా చాలా పెద్ద మొత్తం. కానీ నేను ఇప్పటికే ఒకసారి అలాంటి విలన్ పాత్ర చేశాను. మళ్లీ అదే తరహా పాత్రల్లో కనిపించాలనే ఉద్దేశం నాకు లేదు. నటుడిగా నా ప్రయాణాన్ని ఒకే రకమైన పాత్రలతో పరిమితం చేయకూడదని భావించాను. అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నాను" అని చెప్పారు.

ఈ నిర్ణయం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సలహానే ప్రధాన కారణమని సత్యదేవ్ వెల్లడించారు. 'గాడ్ ఫాదర్' సినిమాలో విలన్‌గా నటించే సమయంలో చిరంజీవి తనతో ప్రత్యేకంగా మాట్లాడారని చెప్పారు. "ఈ సినిమా వరకు విలన్ పాత్ర చేయడం సరే. కానీ ఇకపై వరుసగా అలాంటి పాత్రలు చేయొద్దు. ఇప్పుడు నువ్వు నాతో కలిసి నటిస్తున్నావు కాబట్టి ప్రేక్షకులు నీ గురించి తెలుసుకుంటారు. నీ నటనపై దృష్టి పెడతారు. ఆ తర్వాత నీకంటూ ఒక మార్కెట్ ఏర్పడుతుంది. నిర్మాతలు నీ దగ్గరకు వస్తారు. అప్పుడు నీ సినిమాలు నువ్వు చేసుకోవచ్చు" అని చిరంజీవి చెప్పిన మాటలను సత్యదేవ్ గుర్తు చేసుకున్నారు.

చిరంజీవి ఇచ్చిన ఆ సలహా తన కెరీర్‌పై ఎంత ప్రభావం చూపిందో కూడా ఆయన వివరించారు. "ఆయన చెప్పిన మాటలు కేవలం ఒక సలహా కాదు.. నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చెప్పిన కెరీర్ ప్లాన్. 'గాడ్ ఫాదర్' తర్వాత వెంటనే 'జీబ్రా' సినిమా అవకాశం వచ్చింది. చాలామంది నిర్మాతలు 'చిరంజీవి నమ్మిన నటుడు' అనే కోణంలో నన్ను చూడటం మొదలుపెట్టారు. అదే నాకు కొత్త అవకాశాలకు దారి తీసింది" అని అన్నారు. ప్రస్తుతం తాను విలన్ పాత్రలకు పూర్తిగా దూరమయ్యానని కూడా సత్యదేవ్ స్పష్టం చేశారు. "ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ విలన్ పాత్రలు చేయాలనే ఆలోచన లేదు. నాకు హీరోగా, నటుడిగా వేరే గుర్తింపు కావాలి. ప్రేక్షకులు నన్ను విభిన్నమైన పాత్రల్లో చూడాలి. అందుకే నా సొంత మార్గంలోనే ముందుకు వెళ్తున్నాను" అని చెప్పారు.

ప్రస్తుతం సత్యదేవ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'చిరంజీవి ఇచ్చిన సలహా వల్లే రూ.100 కోట్ల ఆఫర్‌ను వదులుకున్నానని చెప్పడం. మరోవైపు 'రావు బహదూర్' సినిమా సత్యదేవ్ కెరీర్‌కు ఎలాంటి మలుపు తీసుకువస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X