రమ్యకృష్ణతో మరోసారి నాగార్జున.. బంగార్రాజులో చైతు!
2016లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే. చాలా రోజులుగా ఈ చిత్ర సీక్వెల్ తెరకెక్కించేందుకు కళ్యాణ్ కృష్ణ కథపై వర్క్ చేస్తున్నాడు. బంగార్రాజు అనే టైటిల్ కూడా దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే నాగార్జునకు కథ వివరించడం జరిగింది. నాగ్ సూచించిన కొన్ని మార్పులని కూడా కళ్యాణ్ కృష్ణ ఫినిష్ చేశాడట. దీనితో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని అంటున్నారు. నాగ్ ఎప్పుడంటే అప్పుడు ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి కళ్యాణ్ కృష్ణ సిద్ధంగా ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కూడా నాగ్ కు జోడిగా రమ్యకృష్ణ ఎంపికైనట్లు తెలుస్తోంది.

నాగ చైతన్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. చైతు సరసన నటించే హీరోయిన్ ని ఇంకా ఖరారు చేయవలసి ఉంది. ఇదిలా ఉండగా నాగార్జున మన్మథుడు 2 చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలలో ఏది ముందుగా సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











