శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఫస్ట్ లుక్... నాగశౌర్యకు ఈసారి హిట్టే!!

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నాగ శౌర్య. పక్కింటి కుర్రాడి పాత్రల్లో ఒదిగిపోయి అభిమానుల్ని సంపాదించున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో లవర్ బాయ్ ఇమేజ్ కోసం పరితపించిన నాగ శౌర్య ప్రస్తుతం పంథా మార్చాడు. కమర్షియల్ హీరోగా స్థిరపడాలని బాగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌ను స్థాపించాడు. వరుసగా సినిమాలను నిర్మిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు.

ఛలో సినిమాతో ఐరా క్రియేషన్‌ను ప్రారంభించగా.. లాభాలు బాగానే వచ్చాయి. అయితే ఆపై నిర్మించిన నర్తనశాల బోల్తా కొట్టింది. ఆ సినిమా నిర్మాణ పరంగానూ నాగశౌర్యకు పెద్ద దెబ్బ పడింది. చివరగా అశ్వథ్థామ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం నాగశౌర్య కూడా విపరీతంగా కష్టపడ్డాడు. కండలు పెంచి శరీరాకృతిలో మార్పులు తెచ్చుకున్నాడు. అశ్వథ్థామ చిత్రానికి కథ అందించి మరో కోణాన్ని బయటపెట్టాడు.

Sekhar Kammula Unveils Naga Shaurya NS 20 First Look

అయితే అశ్వథ్థామ బోల్తా కొట్టడంతో ప్రస్తుతం నాగ శౌర్య రూటు మార్చాడు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న నాగశౌర్య.. తాజాగా మరో ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు. ప్రాచీన క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్‌పై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. నిన్న విడుదల చేసిన ప్రీ లుక్ అందర్నీ ఆకట్టుకోగా.. రేపు ఉదయం ఫస్ట్ లుక్‌ను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఈ మేరకు రేపు ఉదయం 9 గంటలకు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా.. ఫస్ట్ లుక్‌ను విడుదల చేయించబోతోన్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ రెడ్డి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. జునైడ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ లుక్ చూస్తేనే హిట్ ఖాయమని అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X