Murali Mohan: నాకు మందు తాగడం అలవాటు చేసిందే అక్కినేని నాగేశ్వరరావు.. కానీ ఆ షరతుతోనే!

టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటన కల్గిన ఈయన ఎన్నెన్నో సినిమాల్లో హీరోగా చేశారు. అనేక మంది స్టార్ హీరోయిన్లతో కలిసి పని చేసిన ఈయనను అందరూ ఇష్ట పడేవారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఎలాంటి చెడు అలవాటు లేని తను.. మందు తాగడం వల్ల అక్కినేని నాగేశ్వర రావు వల్ల అలవాటు చేసుకున్నట్లు వివరించారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మురళీ మోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు. అయితే ఈయన ముందుగా వ్యాపారం చేసేవారు. అయితే సినీ ఇండస్ట్రీలో తనకు స్నేహితులు ఎక్కువగా ఉండడం... అందులో ఆయన చూసేందుకు బాగుండడంతో నువ్వు కూడా సినిమాలు చేయు అంటూ చెప్పేవారట. మొదట్లో తాను పట్టించుకోకపోయినప్పటికీ.. అట్లూరి పూర్ణ చంద్రరావు పిలిచి ఆయనకు సినిమా అవకాశం ఇస్తానని చెప్పారట. దీంతో నో చెప్పలేక సినిమా చేశారట. రెండేళ్ల పాటు అటు బిజినెస్ చేస్తూనే ఇటు సినిమాలు చేశారట.

Senior Actor Murali Mohan Said ANR Is The Reason For His Drinks Alcohol Check Details

అయితే ఆయన ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల తర్వాత ఆఫర్లు ఎక్కువవడం ప్రారంభం కావండతో పూర్తిగా బిజినెస్ మానేసి సినిమాల్లోకి వచ్చారట. అయితే అప్పటికే ఆయనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అనుకోకుకండా సినిమాల్లోకి వచ్చిన ఈయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ముఖ్యంగా తాగడం, పార్టీలకు వెళ్లడం, అమ్మాయిలతో కలిసి తిరగడం వంటివి ఎప్పుడూ చేయలేదు. కేవలం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. అయితే తాను ఓసారి అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి ఓ పార్టీకి వెళ్లాల్సి వచ్చిందని మురళీ మోహన్ చెప్పుకొచ్చాడు.

అక్కడ అందరూ తాగుతుండగా.. తాను మాత్రం ఖాళీగా కూర్చున్నట్లు వివరించాడు. అది చూసిన అక్కినేని నాగేశ్వర రావు వెంటనే తన వద్దకు వచ్చి.. ఎందుకు తాగట్లేదని అడిగారట. అలవాటు లేదని చెప్పగానే షాక్ అయిన ఆయన.. లేదు నువ్వు తాగాలి.. మరీ తాగుబోతులా కాకుండా.. మెడిసిన్ లా తీసుకోవాలి.. అప్పుడే నీ ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుందని వివరించారట.

ముఖ్యంగా వయసు మీద పడ్డాకా.. కచ్చితంగా ఆల్కాహాల్ తీసుకోవాల్సి వస్తుందని సలహా ఇఛ్చారట. అలా పెద్దాయన చెప్పాడని.. తాను కూడా అప్పుడప్పుడూ ఒకటి లేదా రెండు పెగ్ లు తీసుకుంటున్నానని.. ఆయనే ఈ అలావాటు చేశారని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X