బాలయ్య కోసం మరో సీనియర్ హీరో.. బోయపాటి అతనికి లైఫ్ ఇస్తాడా?

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ మరొక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ సినిమాల అనంతరం వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఆడియెన్స్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా నందమూరి అభిమానులు ఈ కాంబో కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణ హిట్టు చూసి చాలా కాలమవుతోంది.

ఇక ఈ సారి బోయపాటి శ్రీను మంచి కమర్షియల్ సినిమా అందిస్తాడాని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. వీరి సినిమాలో ఒక సీనియర్ హీరో నటించనున్నట్లు తెలుస్తోంది.

Senior actor venu thottempudi key role in balakrishna upcoming movie

చిరునవ్వుతో, స్వయంవరం వంటి సినిమాలతో ఒకప్పుడు హీరోగా సక్సెస్ లు అందుకున్న వేణు తొట్టెంపూడి బాలకృష్ణ నెక్స్ట్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదివరకే ఓకసారి బోయపాటి వేణుకి దమ్ము సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

కానీ ఆ సినిమా ద్వారా వేణు అంతగా క్లిక్కవ్వలేకపోయాడు. ఇక ఈ సారి ఎలాగైనా మంచి పాత్రతో ఈ సీనియర్ నటుడికి లైఫ్ ఇవ్వాలని బోయపాటి బాలయ్య సినిమాలో అవకాశం ఇచ్చారట. కథను మలుపు తిప్పే ఒక ప్రధాన పాత్రలో వేణు తొట్టెంపూడి కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా వేణు సెకండ్ ఇన్నింగ్స్ లో క్లిక్కవుతాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X