మెగాస్టార్ చిరంజీవితో డ్రీమ్ ప్రాజెక్ట్.. క్లారిటీ ఇచ్చిన మరో సీనియర్ డైరెక్టర్

టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నెవర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ అయితే సెట్ అవుతున్నాయి ముఖ్యంగా అగ్రహీరోలు అగ్ర దర్శకులు కూడా సరికొత్త ప్రాజెక్టులను వెండి తెర పైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి దర్శకుడు పలానా హీరోతో సినిమా చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్న అభిమానుల కోరికలు కూడా త్వరగాబ్ నెరవేరుతుండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి అయితే సీనియర్ దర్శకులతోనే కాకుండా నేటి తరం దర్శకులతో కూడా వర్క్ చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. మంచి కథ సెట్ అయితే నిర్మాతలను తనే సెట్ చేసి పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు.

అయితే మెగాస్టార్ తో చర్చలు జరిపిన కొంతమంది దర్శకుల ప్రాజెక్టులు చాలానే పెండింగ్లో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్న సీనియర్ దర్శకులలో కృష్ణవంశి ఒకరు. అయితే కృష్ణవంశీ మురారి సినిమా తర్వాత ఎవరైనా అగ్రహీరోతో సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నాడు. ఆయనకు అప్పట్లో రెండు కథలను కూడా వినిపించడం జరిగిందట. అయితే కమర్షియల్ అంశాలతో అప్పట్లో కాస్త ఎక్కువగా సినిమాలు చేసినటువంటి మెగాస్టార్ ను కృష్ణవంశీ తన విభిన్నమైన కథలతో మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత కూడా రెండు మూడు కథలను చెప్పే వాటిని డెవలప్ చేయాలని కూడా అనుకున్నారు. అందులో కొన్ని పాయింట్స్ మెగాస్టార్ చిరంజీవి కి చాలా బాగా నచ్చాయి. కానీ ఏవీ కూడా సరిగా సెట్ అవకపోవడం తో మెగాస్టార్ వెనుకడుగు వేశారు.

Senior director krishna vamsi about Megastar chiranjeevi project

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయంపై దర్శకుడు కృష్ణ వంశీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తన జీవితంలో మెగాస్టార్ తో సినిమా చేయాలని ఒక డ్రీమ్ ఉందని గతంలో రెండు మూడు సార్లు కొన్ని కథలపై చర్చలు కూడా జరిగినట్లు తెలియజేశారు. అయితే అనుకున్నట్లుగా స్క్రిప్టు సెట్ అవ్వకపోవడం వల్లనే సినిమా చేయలేకపోతున్నాను వివరణ ఇస్తూ భవిష్యత్తులో అవకాశం వస్తే.. తప్పకుండా మెగాస్టార్ తో సినిమా చేసేందుకు ఒక మంచి కథను సిద్ధం చేస్తానని కూడా కృష్ణవంశీ వివరణ ఇచ్చాడు. అయితే గతంలో ఈ దర్శకుడు రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే అనే సినిమా చేశాడు.

కృష్ణవంశీ మొదట ఆ కథను రామ్ చరణ్ తో సినిమా చేయాలని అనుకోలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి, కృష్ణవంశీ టాలెంట్ పై పూర్తి నమ్మకం ఉండటంతో అతన్ని ప్రత్యేకంగా పిలిపించి ఆ కథను సిద్ధం చేయించాడు. అయితే గోవిందుడు అందరివాడేలే సినిమా ఓపెనింగ్స్ బాగానే అందుకుంది కానీ పూర్తిస్థాయిలో అభిమానులను సంతృప్తి పరచలేకపోయింది. కృష్ణవంశీ మేకింగ్ పై అయితే చిరంజీవి చాలా పాజిటివ్ కామెంట్స్ చేశాడు. భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు ఉంటే చెప్పాలని కూడా వివరణ ఇచ్చాడట. ఇక ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ అనే మరాఠీ రీమేక్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఆ సినిమాపై కృష్ణవంశీ చాలా నమ్మకంతో ఉన్నాడు. ఎలాగైనా మళ్లీ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి రంగమార్తాండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X