పవిత్రలో ఆమె కనిపించిందట.. అందుకే పెళ్లి చేసుకున్నాడట.. అసలు విషయం చెప్పిన నరేష్!
సీనియర్ హీరో నరేష్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇటీవలే నాలుగో సారి కూడా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు అనడం కంటే కూడా కలిసి ఉంటున్నారని చెప్పడం సబబేమో. ఎందుకంటే ఆయన తన మూడో భార్యకు విడాకులు ఇవ్వలేదు. కానీ ఆమెను వదిలేసి ప్రస్తుతం పవిత్రతో కలిసి జీవిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్రను చూడగానే తాను ప్రేమించలేదని.. ఆమెలో తనకు వేరొకరు కనిపించడం వల్లే ఇష్టపడ్డానని చెప్పుకొచ్చారు. అయితే ఆనయకు పవిత్రలో కనిపించింది ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ కు ఇప్పటికే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. మొదటి భార్యకు పుట్టిన కొడుకు.. మూడో భార్య వయసుకు చాలా దగ్గరి వాడు. అయినా సరే ఈయనను ఆమెను పెళ్లి చేసుకోగా.. వారికి ఓ బాబు పుట్టాడు. చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్న వీళ్ల మధ్య చాలానే గొడవలు వచ్చాయి. మూడో భార్యతో తనకు సరైన బంధం లేకపోవడంతో.. నరేష్ పవిత్రా లోకేష్ తో ప్రేమలో పడ్డాడు. ఆమెకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండగా.. భర్తతో విడిపోయి.. నరేష్ తో కలిసి జీవిస్తోంది. ప్రస్తుతం పిల్లలతో పాటు వీరిద్దరూ కలిసి హాయిగా జీవిస్తున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్.. పవిత్ర గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఆమెను చూడగానే తాను ప్రేమించలేదని... ముఖ్యంగా తన క్యారెక్టర్ చూసి ఇష్ట పడ్డానని వివరించాడు. పవిత్రా లోకేష్ మాటలు, చేష్టలు, ఆమె బిహేవియర్ అంతా కూడా అచ్చం తన తల్లి విజయ నిర్మలలాగా అనిపిస్తుంది.. అందుకే ఆమె తనకు చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు. థన 60 ఏళ్ల జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నా కల్గని ఫీలింగ్ అతడిని చూస్తే కల్గిందని అన్నాడు. గతంలో ఎవరి వల్ల పొందని సంతోషాన్ని ఒక్క పవిత్ర వల్ల అనుభవిస్తున్నానని అన్నాడు.

తనకోసం ఎంతో మంది అమ్మాయిలు వచ్చే వాళ్లున్నా, తన దగ్గర ఉన్న డబ్బు, అందానికి ఎంతో మంది దొరికినా.. తనకు మాత్రం పవిత్రతోనే జీవితం కనిపించిందని చెప్పుకొచ్చాడు. తన తల్లి విజయ నిర్మల, కృష్ణ గారు ఒక వయసులో ఉండగానే.. నిజమైన ప్రేమను ఆస్వాదించారు కాబట్టే పెళ్లి చేసుకున్నారని... ఇప్పుడు తన అమ్మకు దొరికినటువంటి ప్రేమే.. తనక్కూడా దొరికిందని నరేష్ వివరించాడు. తన జీవితం అంతా పవిత్రా లోకేష్ తోనే అని కూడా వెల్లడించాడు.


Click it and Unblock the Notifications











