రొమాన్స్ చేస్తుంటే.. అలా మూడ్ చెడగొట్టేది.. రోజాపై శ్రీకాంత్ అసహనం!

విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారిన వారు చిత్ర సీమలో ఎంతోమంది ఉన్నారు వారిలో శ్రీకాంత్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన శ్రీకాంత్.. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగారు. చిరంజీవిలాగే స్టార్‌లా వెలిగిపోవాలనే ఉద్దేశంతో మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నారు. దివంగత రామోజీరావు నిర్మించిన పీపుల్స్ ఇన్‌కౌంటర్‌లో తొలిసారిగా తెరపై తళుక్కుమన్నారు. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. చివరికి నెగిటివ్ రోల్స్‌లోనూ నటించారు. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అబ్బాయిగారు, వారసుడు లాంటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్లూ పోషించారు. తొలిసారిగా వన్ బై టూ మూవీలో హీరోగా నటించారు.

ఇలా సాగిపోతున్న శ్రీకాంత్ కెరీర్‌కు మూవీమొఘల్ డీ రామానాయుడు నిర్మించిన తాజ్ మహల్ బ్రేక్ ఇచ్చింది. యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో బాగా ఆడింది. ఆ వెంటనే దర్శకేంద్రుడు కే .రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడితో శ్రీకాంత్‌ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇష్టమైన హీరోగా మారిపోయారు. ఒక తరం అమ్మాయిలు తమకు కాబోయే భర్త శ్రీకాంత్‌లా ఉండాలని అనుకున్నారంటే అతిశయోక్తి కాదు.

senior hero srikanth recalls funny incident with actress rk roja here s the details

పెళ్లి సందడి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీకాంత్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ వెంటనే కూతురు, వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, తారక రాముడు, మా నాన్నకు పెళ్లి, ప్రేయసి రావే, చాలా బాగుంది, నిన్నే ప్రేమిస్తా, అమ్మో ఒకటో తారీఖు, ఆడుతూ పాడుతూ, ఖడ్గం, పెళ్లాం ఊరెళితే, ఆపరేషన్ దుర్యోధన, శ్రీరామ రాజ్యం వంటి చిత్రాలతో తిరుగులేని స్టార్‌గా నిలిచారు. శ్రీకాంత్ పని అయిపోయింది అనుకున్న దశలో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, సరైనోడు సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యారు.

అయితే మారుతున్న ట్రెండ్‌ ప్రకారం సినిమాలు చేయాలనే ఉద్దేశంతో బోయపాటి శ్రీను దర్శకత్వంతో తెరకెక్కిన అఖండలో విలన్‌గా నటించి భయపెట్టారు. ఇందులో శ్రీకాంత్ రోల్‌కి విమర్శకుల ప్రశంసలు దక్కడంతో ఆయనకు వరుసపెట్టి విలన్ రోల్స్ దక్కాయి. కుమారుడు రోషన్‌ను కూడా హీరోగా పరిచయం చేసిన శ్రీకాంత్ ప్రస్తుతం దేవర, ఆట మార్చేది సినిమాల్లో నటిస్తున్నారు. కెరీర్‌లో వివాదరహితుడుగా పేరున్న శ్రీకాంత్ నేటి వరకు అజాత శత్రువుగానే ఉన్నారు. శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్, బండ్ల గణేష్ తదితరులతో ఎంతో స్నేహంగా ఉంటారు.

senior hero srikanth recalls funny incident with actress rk roja here s the details

ఇటీవల వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి రోజా వల్ల తాను చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ లాంటి సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. అయితే రోజా తనను అన్నయ్య అని గౌరవంగా పిలిచేదని.. కానీ ఓ రోజు షూటింగ్‌ జరిగేటప్పుడు రొమాంటిక్ సాంగ్ ఉందని ఆ సమయంలో అన్నా అలా చేద్దాం , ఇలా చేద్దాం అంటే తనకు ఇబ్బందిగా అనిపించిందని శ్రీకాంత్ తెలిపారు. వెంటనే ఎహే ఆపు .. నువ్వు అన్నా అని పిలిస్తే నాకు ఆ ఫీల్ రావడం లేదని సరదాగా కోప్పడేవాడినని చెప్పారు. అలా నవ్వుకుంటూ ఇద్దరం షూటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయేవాళ్లమని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: hero srikanth rk roja tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X