twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ దేవరకొండ మరో సంచలనం: ‘ఫోర్బ్స్’ అండర్ 30 లిస్టులో..

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రైజింగ్ స్టార్ ఎవరు? కెరీర్లో వేగంగా ఎదుగుతున్న హీరో ఎవరు? అంటే అందరి నోటా దాదాపు విజయ్ దేవరకొండ మాటే వినిపిస్తోంది. ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ సైతం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తాజాగా విడుదల చేసిన 'ఫోర్బ్స్ అండర్ 30' యంగ్ అచీవర్స్ లిస్టులో విజయ్ పేరును చేర్చింది.

    ప్రతిభను చాటుకుంటూ, పొటెన్షియాలిటీ ఏమిటో నిరూపించుకుంటూ.... నిర్దేశించుకున్న లక్ష్యాలవైపు విజయవంతంగా దూసుకెళుతున్న 30 ఏళ్ల లోపు యంగ్ అచీవర్స్ జాబితాను '30 అండర్ 30' పేరుతో ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసింది.

    సినిమా రంగం నుంచి విజయ్ దేవరకొండ

    సినిమా రంగం నుంచి విజయ్ దేవరకొండ

    మొత్తం 16 రంగాల్లో యంగ్ అచీవర్స్ జాబితా ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసింది. ఎంటర్టెన్మెంట్ అండ్ మ్యూజిక్ విభాగంలో 29 ఏళ్ల విజయ్ దేవరకొండతో పాటు యూట్యూబర్ ప్రజక్తా కోలి(25), సింగర్ మేఘనా మిశ్రా(17)కు చోటు దక్కింది.

    తక్కువకాలంలో ఎవరూ ఊహించని స్థాయికి

    తక్కువకాలంలో ఎవరూ ఊహించని స్థాయికి

    విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగారు. ‘పెళ్లి చూపులు'తో హీరోగా తొలి సక్సెస్ అందుకున్న విజయ్... అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో అభిమానుల్లో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘గీత గోవిందం' చిత్రం రూ.100 కోట్లకుపైగా వసూలు చేయడం అతిపెద్ద అచీవ్మెంట్.

    విజయ్ దేవరకొండ మూవీలో హీరోయిన్‌గా కేథరిన్విజయ్ దేవరకొండ మూవీలో హీరోయిన్‌గా కేథరిన్

    సంపాదనలో 72వ స్థానం

    సంపాదనలో 72వ స్థానం

    2018లో సంపాదన పరంగా టాప్ 100 జాబితా ఇటీవల ఫోర్బ్స్ సంస్థ విడుదల చేయగా... విజయ్ దేవరకొండ రూ. 14 కోట్ల సంపాదనతో 72వ స్థానంలో దక్కించుకున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో విజయ్ రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లు టాక్.

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ

    సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్' చిత్రం చేస్తున్నారు. దీంతో పాటు క్రాంతి మాధవ్ డైరెక్షన్లో మరో మూవీకి కూడా కమిట్ అయ్యారు. ఇందులో విజయ్ ఏకంగా నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తుండటం గమనార్హం.

    English summary
    Sensational star Vijay Deverakonda in Forbes under 30. Many of those profiled this year have already tasted success, but have not let stardom affect them. Take, for instance, actor Vijay Deverakonda, a rising star in Telugu cinema, who consciously tries to remain sane for his own good. He is simple, grounded and clear of the path that he wants to take.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X