ఇటలీలో ప్రభాస్, పూజ లవ్ స్టోరీ.. 50 ఏళ్ళు వెనక్కి!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో నిర్మాణం కాస్త ఆలస్యం అవుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ వెండి తెరపై కనిపించకపోవడంతో ఫాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దీనితో ప్రభాస్ కూడా జోరు పెంచాడు.
సాహో తరువాత ప్రభాస్ నటించబోయే చిత్రానికి చకచకా పనులు జరిగిపోతున్నాయి. ప్రభాస్ తదుపరి చిత్రం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర తొలి షెడ్యూల్ ఇటలీలో ప్రారంభం కాబోతోంది. 50 ఏళ్ల క్రితం నాటి పీరియాడిక్ లవ్ స్టోరీగా దర్శకుడు రాధాకృష్ణ ఏ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

తాజగా ఇటలీలో 1970 నాటి పరిస్థితులకు అనుగుణంగా భారీ సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట హీరోయిన్ పూజ హెగ్డేకు సంబందించిన సన్నివేశాలతో చిత్రీకరణ ప్రారంభం అవుతుందట. ఆ తరువాత ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











