నాన్న నన్ను క్షమించు.. ఆర్యన్ కంటతడి.. కొడుకు పరిస్థితి చూసి భోరున విలపించిన షారుక్.. జైలులో ఏం జరిగిందంటే?

ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. తన కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ప్రతీ రోజు షారుక్‌కు కాళరాత్రిగా మిగిలిపోయింది. గత 18 రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ అలసిపోయారు. అక్టోబర్ 20న మరోసారి ఆర్యన్ ఖాన్‌కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో ఆర్థర్ రోడ్‌ జైలులో తన కుమారుడిని కలుసుకొన్న సమయంలో సూపర్ స్టార్ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో జరిగిన సంఘటనలు ఏమిటంటే..

 ఆర్యన్ ఖాన్ విడుదలపై అనుమానాలు?

ఆర్యన్ ఖాన్ విడుదలపై అనుమానాలు?

అక్టోబర్ 3 తేదీ నుంచి ఆర్యన్ ఖాన్ తన కుటుంబానికి దూరమై పోలీసులు, ఎన్సీబీ అధికారులు మధ్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. షారుక్ ఖాన్ కుటుంబం ఆర్యన్‌ను బయటకు తీసుకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చివరకు ఇక ఆర్యన్ విడుదలపై అనుమానాలు నెలకొనడంతో ఒక్కక్కరుగా ఆయనను కలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే షారుక్ గురువారం ఆర్యన్ కలుసుకొన్నారు.

 ఆర్యన్‌తో షారుక్ ములాఖత్

ఆర్యన్‌తో షారుక్ ములాఖత్

ఆర్ఱర్ రోడ్ జైలులోని కౌంటర్ నంబర్ 12లో షారుక్, ఆర్యన్ ఖాన్ ములాఖత్ జరిగింది. తండ్రి షారుక్ ఖాన్‌ను చూడగానే ఆర్యన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. దాంతో షారుక్ ఖాన్ తనకు తాను తమాయించుకొని మానసిక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఆర్యన్, షారుక్ ఖాన్ మధ్య గ్లాస్‌ ఉండటంతో నేరుగా మాట్లాడుకోవడానికి వీలు కాలేదు. దాంతో వారిద్దరు జైలులో ఏర్పాటు చేసిన ఇంటర్‌కామ్ ఫోన్‌తో మాట్లాడుకొన్నారు అని జైలు వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.

తండ్రిని చూడగానే ఆర్యన్ కంటతడి

తండ్రిని చూడగానే ఆర్యన్ కంటతడి

ఆర్యన్ ఖాన్, షారుక్ మాట్లాడుకొనే సమయంలో వారి ముందు జైలు అధికారులు ఉన్నారు. ఓ వైపు ఆర్యన్ ఏడుస్తుండగా, మరోవైపు షారుక్ ఖాన్ ఊరడించే ప్రయత్నం చేశారు. కాసేపు వారిద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. అలా కొద్ది సేపు మౌనంగా ఉన్న తర్వాత వారిద్దరు మాట్లాడుకొన్నారు అని జైలు అధికారులు వెల్లడించారు.

షారుక్ ఖాన్ భోరుమని ఏడుస్తూ....

షారుక్ ఖాన్ భోరుమని ఏడుస్తూ....

తండ్రితో ఆర్యన్ మాట్లాడుతుండగా మధ్యలో ఆర్యన్ ఖాన్ భోరున విలపించారు. దాంతో తనపై తాను నియంత్రణ కోల్పోయిన షారుక్ ఖాన్ కూడా భోరుమని ఏడ్చారు. వారిద్దరిని జైలు అధికారులు సముదాయించారు. దాదాపు తండ్రి కొడుకుల మధ్య 18 నుంచి 20 నిమిషాల వరకు సమావేశం జరిగింది అని జైలు వర్గాలు వెల్లడించాయి.

ఆర్యన్ ఏమైనా తిన్నావా? అంటూ షారుక్

ఆర్యన్ ఏమైనా తిన్నావా? అంటూ షారుక్

భావోద్వేగానికి గురి అవుతున్న షారుక్ ఖాన్‌‌ను చూస్తూ.. నాన్న నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉంటే.. ఐ యామ్ సారీ.. నీవు తప్పు చేయలేదని నమ్ముతున్నాను అని షారుక్ అన్నారు. ఆ తర్వాత ఏమైనా తిన్నావా అనే కొడుకుని అడిగితే.. లేదు అని ఆర్యన్ సమాధానం చెప్పారు. దాంతో ఏదైనా తినడానికి ఇవ్వవచ్చా అంటే.. లేదు కోర్టు అనుమతి లేదు అని చెప్పడంతో షారుక్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆ తర్వాత ఆర్యన్ స్నేహితులతో మాట్లాడుతూ... నా కొడుకును జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ఆ తర్వాత విషాదంతో షారుక్ వెనుదిరిగారు అని అధికారులు చెప్పారు.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
26న ఆర్యన్ బెయిల్ పిటిషన్

26న ఆర్యన్ బెయిల్ పిటిషన్

ఇక ఆర్యన్ ఖాన్ ఎప్పుడెప్పుడూ జైలు నుంచి విడుదల అవుతారు అని షారుక్ కుటుంబం ఎదురు చూస్తున్నారు. బెయిల్ లభిస్తే బాగుండని భగవంతుడిని వేడుకొంటున్నారు. ఇదిలా ఉండగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 26న విచారించనున్నారు. దాంతో ఆ రోజు బెయిల్ లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X