Jawan Success Celebration 2023 లోనే మూడో బ్లాక్‌బస్టర్ రెడీ.. Dunki రిలీజ్ ప్రకటించిన షారుక్ ఖాన్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్నది. ఈ చిత్రం 700 కోట్ల రూపాయల వసూళ్లకు చేరువైంది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌తో షారుక్ ఖాన్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకొన్నారు. ఈ వేడుకకు స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ కూడా హాజరయ్యారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో షారుక్ ఎమోషనల్‌గా మాట్లాడి అభిమానులు ఆకట్టుకొన్నారు. పఠాన్, జవాన్ తర్వాత తన మూడో సినిమాను ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్సంగా షారుక్ మాట్లాడుతూ..
జవాన్ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు వచ్చిన మీడియాకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో నటించిన యాక్టర్లు ఈ వేడుకకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా కోవిడ్ కారణంగా లేట్ అయింది. తమిళం నుంచి చాలా మంది యాక్టర్లు నటించారు. వారి డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి.. ముగించే వారకు అట్లీకి పిల్లలు కూడా పుట్టారు అని షారుక్ అన్నారు.

విజయ్ సేతుపతి నటన, దీపిక పదుకోన్, నయనతార గ్లామర్, సునీల్ గ్రోవర్ నటన బాగుంది. రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై రూపొందించిన కో ప్రొడ్యూసర్ గౌరవ్ శర్మకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం పనిచేసిన పూజా దద్లానీ లాంటి వాళ్లు పనిచేశారు. నయనతార ఈ వేడుకకు రాలేదు. ఎందుకంటే నయనతార తల్లి పుట్టిన రోజు. కాబట్టి ఆమెకు నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు అని అన్నారు.

నాకు హిట్ వచ్చిందని గొప్పలు చెప్పడం లేదు. దేవుడి దయ వల్ల పఠాన్, జవాన్ సినిమాలు హిట్ అయ్యాయి. 2023 సంవత్సరం మంచి హిట్‌తో ప్రారంభించాం. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవం రోజున పఠాన్ సినిమాను రిలీజ్ చేశాం. సెప్టెంబర్ 7వ తేదీన శ్రీకృష్ణుడి పుట్టిన రోజు కృష్ణాష్టమి రోజున జవాన్ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చాం. శుభదినాల్లో మీకు మంచి సినిమాలు అందించాం అని షారుక్ ఖాన్ అన్నారు.

ఇక నా జాతీయ సమైక్యత అంటే ఇష్టం. అందుకే నేను నా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఇక నూతన సంవత్సరం వచ్చే ముందు అంటే డిసెంబర్ 22వ తేదీన డంకీ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. గత రెండు సంవత్సరాలుగా తీరిక లేకుండా నటిస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది అని షారుక్ ఖాన్ అన్నారు.
డంకీ సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షారుక్ ఖాన్, తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, ధర్మేంద్ర, వికీ కౌశల్, తదితరులు నటిస్తున్నారు.ఈ సినిమాను గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. సీకే మురళీధరన్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











