షారుక్ ఖాన్‌కు ఫ్రాన్స్‌లో విశేష గౌరవం.. తొలి భారతీయుడిగా బాద్షా రికార్డు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. సినిమా పరిశ్రమకు ఘనమైన సేవలు అందిస్తున్న ఆయనకు ఫ్రాన్స్ మ్యూజియం ప్రత్యేకంగా సన్మానించింది. గ్రేవిన్ మ్యూజియం ఆయన పేరిట బంగారు నాణేలను ముద్రించి ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకొన్నది. దాతో ఈ ఘనతను సాధించిన తొలి భారతీయడిగా షారుక్ రికార్డు క్రియేట్ చేశారు. ఇటీవల కాలంలో షారుక్ ఖాన్ అనేక అవార్డులు, రివార్డులను అందుకొంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
షారుక్ ఇటీవల లాంకార్నో ఫిలిం ఫెస్టివల్‌లో గౌరవ లిపార్డ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకొనున్నారు. భారతీయ సినిమా రంగంలో 100కుపైగా సినిమాల్లో నటించిన ఘనతను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డును ఆగస్టు 10వ తేదీన అందజేస్తారు. ఈ సందర్భంగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆయన నటించిన దేవదాస్ సినిమాను ఆగస్టు 11వ తేదీన పబ్లిక్‌కు ప్రదర్శిస్తారు అని తెలిపారు.

ఇక షారుక్ ఖాన్ విషయానికి వస్తే.. గత రెండేళ్లలో ఆయన బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాలు అందుకొన్నారు. ఆయన నటించిన జవాన్ చిత్రం 1162 కోట్ల రూపాయలు, పఠాన్ చిత్రం 1052 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆయన నటించిన డంకీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది.
డంకీ చిత్రం తర్వాత ప్రస్తుతం షారుక్ ఖాన్ కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. సుజోష్ ఘోష్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో తన కూతురు సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఆయన నటిస్తారు. ఇంకా పలువురు డైరెక్టర్లతో పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











