Top 10 Richest Actors: ప్రపంచ సంపన్న యాక్టర్ షారుక్.. హాలీవుడ్ హీరోలను తలదన్నేలా.. ఎన్ని వేల కోట్ల ఆస్తులంటే?

సాధారణ స్థాయి నుంచి ప్రపంచంలోనే ప్రభావిత వ్యక్తిగా ఎదిగిన సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఇటీవల ప్రకటించిన ప్రపంచంలోనే 10 సంపన్న నటుల (Richest Actors) జాబితాలో బాలీవుడ్ బాద్షాకు చోటు దక్కింది. అయితే హాలీవుడ్‌లో కొందరు సూపర్ స్టార్ల కంటే ఎక్కువ సంపద కలిగిన యాక్టర్‌గా ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషంగా మారింది. షారుక్ ఖాన్ నికర ఆస్తులు ఎంత? ఆయన ఎవరి కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నాడనే వివరాల్లోకి వెళితే..

సాధారణ స్థాయి నుంచి అసాధారణ వ్యక్తిగా
ఢిల్లీకి చెందిన ఓ యువకుడు నటుడు కావాలని ముంబైలో అడుగుపెట్టి రకరకాల కష్టాలు చవిచూశాడు. అప్పటి బొంబాయి నగరంలోని సముద్ర తీరంలోని ఫుట్‌ఫాత్‌ మీద నిద్రించిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకొంటారు. అలాంటి పరిస్థితుల్లో హిందీ సినిమా పరిశ్రమను శాసించాలనే కలను ఎన్నో అడ్డంకులను ఎదురించి.. ఎన్నో అవకాశాలను చేజిక్కించుకొని బాలీవుడ్‌కు బాద్షాగా నిలవడమే కాకుండా ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారు.

Shah Rukh Khan in Top 10 World s Richest Actors Of 2025

టెలివిజన్ సీరియల్స్ నుంచి బిగ్ స్క్రీన్ వరకు
టెలివిజన్ సీరియల్ ఫౌజీ నుంచి హిందీ సినిమా పరిశ్రమలో హీరోగా స్థాయికి చకచకా మెట్లు ఎక్కుకొంటూ విజయాలను సొంతం చేసుకొన్నాడు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకొనే హీరోల్లో ఒకడిగా నిలిచాడు. గత రెండేళ్లుగా తన సినిమాలతో రికార్డు కలెక్షన్లు సాధించాడు. జవాన్ సినిమా ద్వారా 1150 కోట్ల కలెక్షన్లు, పఠాన్ మూవీ ద్వారా 1050 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాడు. గత ఏదేళ్లలో షారుక్ ఖాన్ సంపద 46 శాతం పెరిగిందని వెల్లడించారు.

నటుడిగా, వ్యాపార వేత్తగా
నటుడిగానే కాకుండా పలు సంస్థలకు అధిపతిగా వ్యాపారం రంగంలో భారీ లాభాలను సాధిస్తున్నాడు. సినీ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐపీల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ లాంటి ఫ్రాంచైజీలకు ఓనర్‌గా ఉన్నారు. అలాగే ఎన్నో వ్యాపార ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకొంటున్నారు.

ప్రపంచంలోనే నాలుగో స్థానం
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంపన్నుల జాబితాలో షారుక్ ఖాన్‌కు నాలుగో స్థానం లభించింది. ఆర్థిక సంస్థ గణాంకాల ప్రకారం.. షారుక్ నికర సంపద 846.5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 7400 కోట్ల రూపాయలు. అయితే ఈ జాబితాలో మరే భారతీయ నటుడికి చోటు దక్కకపోవడం గమనార్హం. ఇండియా నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక హీరోగా షారుక్ ఘనతను సాధించాడు.

వరల్డ్ టాప్ 10 యాక్టర్ల జాబితా
ప్రపంచంలోనే 10 మంది అత్యధిక ధనిక యాక్టర్ల జాబితా వివరాల్లోకి వెళితే.. నెంబర్‌వన్ స్థానంలో డ్వెయిన్ జాన్సన్ (1.19 మిలియన్ డాలర్లు), రెండో స్థానంలో అర్నాల్డ్ స్వార్జ్నెగర్ (1.49 మిలియన్ డాలర్లు), 3వ స్థానంలో టామ్ క్రూయిజ్ (891 మిలియన్ డాలర్లు), షారుక్ ఖాన్ (846.5 మిలియన్ డాలర్లు), జార్జ్ క్లూనీ (742.8 మిలియన్ డాలర్లు), రాబర్డ్ డీ నీరో (735.35), బ్రాడ్ పిట్ (594.23 మిలియన్ డాలర్లు), జాక్ నికోల్సన్ (590 మిలియన్ డాలర్లు), టామ్ హంక్స్ (571.94 మిలియన్ డాలర్లు), జాకీ చాన్ 557.09 మిలియన్ డాలర్లు) సంపద కలిగి ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X