విజయ్, సల్మాన్, అమితాబ్‌ను వెనక్కి నెట్టిన షారుక్.. ఆ విషయంలో బాద్ షా టాప్!
Shahrukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగాడు. బాలీవుడ్ బాదుషా గా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తన 35 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలను అందుకున్నారు. ఎన్నో రికార్డులను నెలకొల్పారు. తాజా మరో రికార్డు క్రియేట్ చేశారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. ఆ విషయంలోనూ బాద్ షా అనిపించుకున్నారు. ఇంతకీ ఆ రికార్డు ఏంటీ? ఏ విషయంలో బాద్ షా గా నిలిచారో మీరు కూడా తెలుసుకోండి.
ఆ రికార్డేంటీ? అని ఆలోచిస్తున్నారా? అత్యధిక ఆదాయ పన్ను చెల్లిస్తున్న టాప్ సెలెబ్రిటీగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నిలిచారు. ఈ ఏడాదిలో రూ. 92 కోట్లు ఆదాయపన్నుగా చెల్లించారు. నిజంగా 2023లో షారుఖ్ ఖాన్ కేరీర్ లో సక్సెస్ ఇయర్ గా మారింది. ఆయన నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అవే 'పఠాన్', 'జవాన్', 'డుంకీ'. ఈ మూవీస్ లో 'జవాన్' దేశీయంగా రూ.643.87 కోట్లు రాబట్టగా, 'పఠాన్' రూ.543.05 కోట్లు వసూలు చేసింది. డుంకీ మూవీ రూ.212.42 కోట్లు రాబట్టింది. ఇలా అత్యధికంగా వసూల్ చేసి.. బాలీవుడ్ బాద్ షా గా షారుక్ నిలిచారు.

ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం.. షారుక్ ఖాన్ FY24లో రూ. 92 కోట్లు ఆదాయపన్నుగా చెల్లించారంట. ఆయన తరువాత తలపతి విజయ్ 80 కోట్లు, సల్మాన్ ఖాన్ 75 కోట్ల రూపాయాలను ఆదాయం పన్నుగా చెల్లిస్తున్నారు. ఇక బాలీవుడ్ అగ్ర నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఏటా రూ.71 కోట్ల పన్నుగా చెల్లించి నాలుగో స్థానంలో ఉండగా, రూ.66 కోట్లు చెల్లించిన విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నారు.
టాప్ 10 సెలబ్రెటీలు
షారూఖ్ ఖాన్: రూ. 92 కోట్లు
తలపతి విజయ్: 80 కోట్లు
సల్మాన్ ఖాన్: రూ. 75 కోట్లు
అమితాబ్ బచ్చన్: రూ. 71 కోట్లు
విరాట్ కోహ్లీ: 66 కోట్లు
అజయ్ దేవగన్: 42 కోట్లు
ఎంఎస్ ధోని: రూ. 38 కోట్లు
రణబీర్ కపూర్: రూ. 36 కోట్లు
హృతిక్ రోషన్ : రూ. 28 కోట్లు
సచిన్ టెండూల్కర్: రూ. 28 కోట్లు
కపిల్ శర్మ: రూ. 26 కోట్లు
టాప్-20 జాబితాలో హాట్ బ్యూటీస్..

ఇక అత్యధిక పన్ను చెల్లించిన టాప్-20 సెలబ్రెటీల జాబితాలో కపిల్ శర్మ (రూ. 26 కోట్లు), సౌరవ్ గంగూలీ (రూ. 23 కోట్లు), కరీనా కపూర్ (రూ. 20 కోట్లు), షాహిద్ కపూర్ (రూ. 14 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ. 13 కోట్లు) చోటు దక్కించుకున్నారు. అలాగే.. కియారా అద్వానీ (రూ. 12 కోట్లు). మోహన్‌లాల్ (రూ. 14 కోట్లు), అల్లు అర్జున్ (రూ.14 కోట్లు) చొప్పున పన్ను చెల్లించి జాబితాలో నిలిచారు. అలానే పంకజ్ త్రిపాఠి, కత్రినా కైఫ్ కూడా చెరో రూ.11 కోట్లు పన్ను చెల్లించారు. ఇక అమీర్ ఖాన్ రూ.10 కోట్లు, రిషబ్ పంత్ రూ.10 కోట్ల చొప్పున పన్ను చెల్లించి వరుసగా 21, 22వ స్థానాల్లో నిలిచారు. అమీర్ చివరిసారిగా అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన లాల్ సింగ్ చద్దా (2022) మూవీలో నటించాడు.
ఇక దళపతి విజయ్ కూడా తన చిత్రం GOATతో క్రేజీ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇండియా సిని పరిశ్రమలో అత్యధికంగా రెమ్యూరేషన్ తీసుకున్న హీరోగా నిలిచారు. దాదాపు 200 కోట్ల రూపాయాలు తీసుకున్నట్టు టాక్. అలాగే.. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
అలాగే అతని లియో మూవీ 2023లో పెద్ద విజయాన్ని సాధించింది. ఇది కూడా అతనికి కలిసి వచ్చింది. దీంతో అత్యధిక పన్ను చెల్లించిన సెలెబ్రిటీస్ జాబితాలో రెండోవ స్థానంలో నిలిచారు.


Click it and Unblock the Notifications











