Shah Rukh Khan: బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్ షా సంపాదనలోనూ రారాజే.. షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Shahrukh Khan Net Worth: బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ అత్యధికగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా హీరో.. ఆయనకు కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులున్నారు. ఆయన కేవలం అభిమానుల్లోనే టాప్ హీరో కాదు.. దేశంలో అత్యంత ధనిక నటుల్లో ఒకరు. షారుక్ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నాడు జీరో నుంచి ప్రయాణం ప్రారంభించి.. నేడు బాలీవుడ్ ను శాసించే హీరోగా ఎదిగారు. వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. నేడు ఆయన బర్తేడే సందర్భంగా హీరో షారుఖ్ కు ఎన్ని కోట్ల విలువైన ఆస్తులున్నాయో ఓ లూక్కేద్దామా..

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రపంచంలో అత్యంత పాలోవర్స్ ఉన్న స్టార్ హీరోనే కాదు.. అత్యంత ధనిక నటులలో తొలిస్థానంలో నిలిచారు. Hurun India Rich 2024 నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ వ్యక్తిగత నికర విలువ రూ. 7300 కోట్లు (Shahrukh Khan Net Worth), అత్యధిక సంపాదన గల సెలబ్రెటీల జాబితాలో షారుక్ మొదటి స్థానంలో నిలిచాడు.

Shah Rukh Khan Net Worth Do You Know Bollywood Star Actor Shah Rukh Khan s Wealth properties and car collection

కింగ్ ఖాన్ షారుక్ కు కోల్‌కతా నైట్ రైడర్స్ అనే IPLటీం ఉన్న విషయం తెలిసిందే. అలాగే.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాడు షారుక్. పలు నివేదిక ప్రకారం.. షారుక్ ఖాన్ ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ప్రతి సంవత్సరం 500 కోట్లు సంపాదిస్తున్నాడు. షారుక్ కిడ్‌జానియా యొక్క ఫ్రాంచైజీ ఇమాజినేషన్ ఎడ్యుటైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సహ యజమాని కూడా. షారుక్ ఖాన్ ప్రకటనల కోసం కూడా భారీ మొత్తంలో వసూలు చేస్తాడు.

షారుక్ ఒక్కొక్క ప్రకటన షూట్ కోసం రూ. 3.5 నుండి 4 కోట్లు వసూలు చేస్తాడు. అలాగే.. ఇక ఒక్కో బ్రాండ్ ప్రమోషన్‌కు షారూఖ్ ఖాన్ 5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. అదే సమయంలో.. సినిమాల్లో నటించిందుకు గాను ఒక్కొక్క సినిమా నుంచి దాదాపు 150-250 కోట్లు వసూలు చేస్తాడు. గతేడాది ఆయన నటించిన 'జవాన్', 'పఠాన్', 'డంకీ' చిత్రాలు వరుస విజయాలు అందుకున్నాయి. దీంతో కింగ్ ఖాన్ సంపద మరింత పెరిగింది.

కింగ్‌ఖాన్‌కి కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఉన్నాయి. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో షారుఖ్ ఖాన్‌కు 'మన్నత్' అనే పేరు మీద ఓ లగ్జరీ ఇల్లు ఉంది. దీని విలువ దాదాపు 200 కోట్లు. ఇది కాకుండా అలీబాగ్‌లో దాదాపు 15 కోట్ల రూపాయల విలువైన ఫామ్‌హౌస్ ఉంది. షారుఖ్‌కు దుబాయ్ సమీపంలోని జుమేరాలో ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. ఈ లగ్జరీ ఇంట్లో 6 బెడ్‌రూమ్‌లు, రెండు రిమోట్ కంట్రోలింగ్ గ్యారేజీలు , ఒక ప్రైవేట్ పూల్ ఉన్నాయి. ఇది కాకుండా షారూఖ్ ఖాన్‌కు లండన్‌లో రూ.183 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇదిపార్క్ లేన్ ప్రాంతంలో ఉంది. అలాగే..కింగ్ ఖాన్‌కు లాస్ ఏంజెల్స్‌లో ఒక విల్లా ఉంది. రియల్ ఎస్టేట్‌లో కోట్లల్లో పెట్టుబడులు పెట్టాడు.

షారుక్ ఖాన్ కార్ల కలెక్షన్.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వద్ద ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. అవి షారుక్ లైఫ్ స్టైల్ ను రిప్లేక్ట్ చేస్తాయి. మీడియా నివేదికల ప్రకారం.. షారుక్ వద్ద BMW, Rolls-Royce, Mercedes-Benz, Audi, Bugatti, Range Rover వంటి హై-ఎండ్ బ్రాండ్‌లు కార్లు చాలానే ఉన్నాయి. ఇందులో రూ. 12 కోట్ల విలువైన బుగట్టి వేరాన్ షారుక్ కలెక్షన్‌కు మకుటంగా నిలిచింది. ఇతర ప్రముఖ కార్లలో రూ. 9.5 కోట్ల విలువైన రోల్స్-రాయిస్ ఫాంటమ్, రూ. 3.29 కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ జీటీ ఉన్నాయి .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X