కృష్టాష్టమి రోజున ఉట్టి కొట్టిన షారుక్.. వైరల్‌‌గా మారిన వీడియో.. ఎందుకంటే!

కృష్టాష్టమి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా భాగమయ్యారుు. తన నివాసంలో జరిగిన జన్మష్టమి వేడుకల్లో పాల్గొని దహీ అండీ (పాలు, పెరుగుతో కూడి ఉట్టి)ని పగులకొట్టారు. షారుక్ ఉట్టి కొట్టిన వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియో వైరల్ కావడానికి అసలు కారణమేమిటంటే. .

జన్మష్టమి రోజున ఉట్టి కొట్డడానికి షారుక్ ఉత్సాహంతో ముందుకు వచ్చాడు. తనకంటే ఎత్తున ఉన్న దానిని పగులకొట్టడానికి తన సెక్యూరిటీ గార్డు భుజాలపైకి ఎక్కాడు. కొబ్బరి కాయతో పాలు, పెరుగు, వెన్న ఉన్న ఉట్టిని పగులకొట్టాడు. అయితే ఉట్టిలోని ద్రవం అంతా షారుక్ తలపై పడింది. ఇది గమనించిన షారుక్ వెంటనే దిగి సెక్యూరిటిని తలను తడిచి వాటిని తీసివేశాడు.

Shah Rukh Khans Janmashtami video goes viral

సెక్యూరిటీ తలపై ఉన్న పాలు, పెరుగు ఇతర ద్రవాన్ని తడిచి వేయడం నెటిజన్లు ఆకట్టుకొన్నది. సూపర్‌స్టార్ తన సహాయకుడు గురించి చూపిన చొరవ, ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక షారుక్ కెరీర్ విషయానికి వస్తే, గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్‌కు సరైన హిట్టు లేదు. ఆయన నటించిన జీరో సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో సినిమాను ప్రారంభించినట్టు కనిపించలేదు. త్వరలోనే తన కొత్త సినిమాతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X