Shah Rukh Khan ఇంటి నేమ్ ప్లేట్ మార్పు.. దాని ఖర్చు ఎన్ని లక్షలంటే.. వాస్తు కోసం భారీ ఖర్ఛు

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. షారుక్‌ను ఇష్టపడేవారు, ప్రాణం కంటే అమితంగా ప్రేమించే వారు కోకొల్లలు. ఆయనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్నైనా చాలా నిశితంగా అభిమానులు పరిశీలిస్తారు. ఇటీవల ఆయన ఇంటి నేమ్ ప్లేట్‌ను మార్చిన విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ ఇంటికి సరికొత్తగా పెట్టిన నేమ్ ప్లేట్ ఫోటోలను షేర్ చేసి షారుక్‌పై ఫ్యాన్స్ అభిమానాన్నిచాటుకొన్నారు.

ముంబైలో సందర్శకులు ఎక్కువగా పర్యటించే ప్రదేశాల్లో షారుక్ ఖాన్ నివాసం మన్నత్ ఒక్కటి. సముద్రానికి అభిముఖంగా ఉండే విలాసవంతమైన భవంతి ముందు అభిమానులు నిలబడి ఫోటోలు తీసుకొనే దాఖలాలు చాలా ఎక్కువే. ఈ స్టార్ హీరో నివాసానికి ఇటీవల నేమ్ ప్లేట్ మార్చడం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. షారుక్ కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో ఆయన సతీమణి.. స్వతహాగా ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌరీ ఖాన్ ఇటీవల తన ఇంటికి కొన్ని మరమత్తులు చేయించారు.

Shah Rukh Khans residence Mannats new name plate cost details here

వాస్తు ప్రకారం కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. అందులో భాగంగానే షారుక్ ఇంటి పేరు మన్నత్‌కు సంబంధించిన నేమ్ ప్టేట్‌ను సరికొత్తగా తయారు చేయించి ఫిట్ చేయించారు. గౌరీ ఖాన్ డిజైన్ చేసిన నేమ్ ప్లేట్ ధర ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. అయితే షారుక్ సన్నిహిత వర్గాలు తెలిపిన ప్రకారం ఆ నేమ్ ప్లేట్ ఖరీదు అక్షరాల 25 లక్షల రూపాయలు అని చెప్పారు.

ఇక షారుక్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. సుమారు నాలుగేళ్లుగా ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాలతో బిజీగా మారారు. పఠాన్ చిత్రంలోను, అలాగే తమిళ దర్శకుడు అట్లీతో కలిసి చేసే మరో క్రేజీ ప్రాజెక్టు నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి.

ఇటీవల రాజ్ కుమార్ హిరాణితో షారుక్ ఖాన్ జతకట్టారు. డంకీ అనే చిత్రంలో షారుక్ నటిస్తున్నట్టు అదికారికంగా ప్రకటించారు. హిరాణి, షారుక్ కలిసి చేసిన వీడియో ప్రకటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X