ఒక్క సినిమాతో ప్రభాస్ రెమ్యునరేషన్ ను బ్రేక్ చేసిన షారుక్ ఖాన్.. మైండ్ బ్లాక్!
ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరో ఎవరనే ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ జాబితాలో టాప్ చైర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారు. ఆయన ఒక్కో సినిమాకి 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ K కోసం ఏకంగా 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ క్రింద తీసుకున్నారు అనే టాక్ ప్రచారంలో ఉంది.
ఇక టాలీవుడ్ స్టార్ అయిన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వారి రాబోయే సినిమాలకు కూడా వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీకి గాను మొత్తం 200 కోట్ల వరకు తీసుకున్నారంట. రెమ్యునరేషన్ తో పాటుగా సినిమా లాభాలలో కూడా 60 శాతం వాటాగా తీసుకున్నారు.

దీంతో ఏకంగా పఠాన్ మూవీ కోసం షారుఖ్ ఖాన్ కి 200 కోట్ల వరకు పేమెంట్ గా గిట్టుబాటు అయ్యింది. ఈ నేపధ్యంలో షారుఖ్ ఖాన్ ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఇప్పుడు మారిపోయారు. మొత్తానికి ఇన్ని రోజులు టాలీవుడ్ హీరోలు ఇండియాలోనే హైయెస్ట్ పెయిర్ యాక్టర్స్ గా ఉండగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ దానిని బీట్ చేసి మరల బాలీవుడ్ జెండా ఎగరేసారు.
అయితే ప్రాజెక్ట్ కె కంప్లీట్ అయిన మరల ప్రభాస్ కూడా 200 కోట్ల రెమ్యునరేషన్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ సినిమాలు ఉన్నాయి. వీటి తర్వాత స్పిరిట్ మూవీ ఉంది. ఇవి హిట్ అయితే ప్రభాస్ ఇమేజ్ ని ఇంకెవరు అందుకోలేరని చెప్పొచ్చు.
అయితే ఈ మధ్యకాలంలో హీరోలు అందరూ కూడా రెమ్యునరేషన్ కి కాకుండా మూవీ ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో అన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు సినిమా హిట్ అయితే వచ్చే లాభాల ద్వారా హీరోల రెమ్యునరేషన్ 400 వందల కోట్లకి రీచ్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.


Click it and Unblock the Notifications











