షారుఖ్ స్పేస్ మూవీ టైటిల్ ఇదే!
షారుక్ ఖాన్ నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జీరో' చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. షారుఖ్ నటనకు ప్రశంసలు లభించాయి కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తాపడింది. ఇటీవల షారుఖ్ వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా పరాజయాన్ని పట్టించుకోకుండా తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. షారుఖ్ నుంచి తదుపరి రాబోతున్న చిత్రం ప్రయోగాత్మకంగా ఉండబోతోంది.
భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్ లో షారుక్ నటిస్తాడు. ఈ సినిమాకి 'సెల్యూట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. భారీ బడ్జెట్ తో సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, మహేశ్ మతాహి దర్శకత్వం వహించనున్నాడు. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ముంబైలో ఈ చిత్రం కోసం భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ తన అభిమానులకు భారీ హిట్ అందించి చాలా ఏళ్ళు గడుస్తోంది. సెల్యూట్ చిత్రంతో షారుఖ్ అభిమానుల కోరిక నెరవేరుస్తాడో లేదో చూడాలి. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











