పుష్ప సాంగ్ పై షారుక్ ఖాన్ స్టెప్పులు.. అల్లుఅర్జున్ లాగా చేయడం కష్టమే మామా ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ పుష్ప. ఈ మూవీ విడుదలై మూడేండ్లు అవుతున్నా పుష్ప క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మాణం వ‌హించింది. ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, ర‌ష్మిక మంధాన హీరోయిన్ గా నటించింది. ఈ క్రేజీ మూవీకి దేవి శ్రీ ప్ర‌సాద్ క్రేజీ మ్యూజిక్స్ అందించారు. ఇందులో 'ఊ అంటావా మామా' అనే ఐటెం సాంగ్ కు హీరోయిన్ స‌మంత స్టెప్పులేసి ఆకట్టుకుంది. అయితే.. ఈ క్రేజీ సాంగ్ కు బాలీవుడ్ స్టార్ హీరో సెప్పులేశాడు. అది కూడా ఓ ప్రతిష్టాత్మక అవార్డు ఈవెంట్ లో ఇంతకీ ఈ స్టార్ హీరో ఎవరో ఓ లూక్కేయండి.

మూడేండ్ల క్రితం విడుదలైన అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కు ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఈ మూవీలోని హీరో అల్లుఅర్జున్ వేసిన సెప్పులు,స్వాగ్, యాక్షన్, డైలాగ్ డెలివరీ అన్నీ ఫ్యాన్స్‌కి పిచ్చపిచ్చగా నచ్చేశాయి. ఎంతోమంది సెలబ్రెటీలు కూడా డైలాగ్స్ , స్టెప్పులు వేసి ఆక‌ట్టుకున్నారు. ఇక పుష్ప మూవీలో నటన గానూ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. దీంతో అల్లు అర్జున్ పేరు నేషనల్ లెవల్ లో మార్మోగింది. ఈ క్రమంలో పుష్ప 2పై కూడా భారీ అంచనాలు పెరిగాయి. వాస్తవానికి అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప మూవీ వాస్తవానికి ఆగస్టు 15కి విడుదల కావాల్సింది. కానీ, ఈ మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్ 6కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం అల్లు ఫ్యాన్స్ ఇగర్ గా వేయిట్ చేస్తున్నారు.

Shah Rukh Khan Vicky Kaushal dance performance to Icon Star Allu Arjun Pushpa Song Oo Antava at IIFA 2024 in Abu Dhabi

ఇదిలాఉంటే.. పుష్ప మూవీపై, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) 2024 వేడుకలు అబుదాబి వేదికగా జరుగుతాయి. ఈ వేడుకుల్లో బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కాసేపు హోస్ట్ గా వ్యవహరించారు.ఈ క్రమంలో అల్లు అర్జున్ మూవీ పుష్ప టాపిక్ రావడం మూవీలోని 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' పాటకి బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, హీరో విక్కీ కౌశల్‌తో కలిసి స్టెప్పులేశారు.

అనంతరం షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. "అల్లు అర్జున్ సార్ స్వాగ్‌ను మ్యాచ్ చేయడం మన వాళ్ల కాదు" అంటూ ఇంట్రెస్టెంగ్ కామెంట్ చేశారు. దీనికి వీక్కి అవును.. నేను చాలా సార్లు ట్రై చేశా కానీ నా వల్ల కాలేదు అంటూ సరదాగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అల్లు అర్జున్ ను బాలీవుడ్ బాద్షా షారుక్ మెచ్చుకోవడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Shah Rukh Khan Vicky Kaushal dance performance to Icon Star Allu Arjun Pushpa Song Oo Antava at IIFA 2024 in Abu Dhabi

బాలీవుడ్ స్టార్ హీరోస్ తన పాటపై డ్యాన్స్ చేయడంతో హీరోయిన్ సమంత కూడా రియాక్ట్ అయ్యింది. "ఎప్పటి మూమెంట్ జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు' అని హార్ట్ గుర్తును పెట్టి తన ఇన్‌స్టా స్టోరీస్ షేర్ చేసింది సమంత. నిజానికి ఈ పాటపై సమంత వేసిన మాస్ స్టెప్పులు ఇప్పటికీ కూడా సంచలనమే.ఈ స్పెప్పులు మాస్ ప్రేక్షకులను ఎంతగా ఆక్ట్రాక్ చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X