ప్రభాస్ గురించి బాలీవుడ్ హీరో ప్రస్తావన.. బాహుబలి అలా అనడంతో
బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ కొట్టేశాడు. ఓ తెలుగు హీరో టాలెంట్ ఎలా ఉంటుందనేది ప్రపంచానికి రుచి చూపించారు. దీంతో వరల్డ్ వైడ్‌గా ప్రభాస్‌కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం సాహూ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రభాస్‌కి దేశంలోని ఇతర భాషా నటీనటులు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ఈ మధ్యకాలంలో విడుదలైన కబీర్ సింగ్ ట్రైలర్ చూసిన ప్రభాస్ ఆ ట్రైలర్‌పై తనదైన కామెంట్ చేశారు.
అయితే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. వరల్డ్ ఫేం ప్రభాస్‌కి మా కబీర్ సింగ్ టీజర్ చాలా నచ్చిందని తెలుపుటకు సంతోషిస్తున్నా. ఈ ట్రైలర్ చూసిన ప్రభాస్ నాకు ఫోన్ చేసి కబీర్ సింగ్ ట్రైలర్ చూస్తుంటే అర్జున్ రెడ్డి కాపీ-పేస్ట్‌లా లేదు అని చెప్పడంతో చాలా సంబరపడ్డా. దక్షిణాదిలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఉత్తరాది ప్రేక్షకుల ముందుంచాలనే తీశాం. అందుకే హిందీలో తెరకెక్కించాం. టార్గెట్ ఇక్కడే అయినప్పటికీ ప్రశంస ప్రభాస్ లాంటి హీరో నుంచి రావడం ప్రోత్సాహకరంగా అనిపించిందని షాహిద్ పేర్కొన్నారు.

తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా హిందీలో కబీర్ సింగ్ మూవీ తెరకెక్కుతోంది. తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ కబీర్ సింగ్‌ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కియారా, షాహిద్ మధ్య షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. కబీర్ సింగ్ చిత్రం జూన్ 21 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











