ఆమె స్నానం చేస్తుంటే చూడాలని ఉంది.. పెళ్లి కూడా బ్రేకప్ అయితే.. షాహీద్ కపూర్
సినీ తారలైనా వారు అభిమానించే సెలబ్రిటీలు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత పెద్ద స్టారైనా ఎవరిపైనో అభిమానం పెంచుకోవడం సహజం. అలా తాను అమితంగా ఇష్టపడే హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ అని బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ చెప్పారు. గతంలోని షాహీద్‌కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ప్రమోషన్‌లో భాగంగా స్కార్లెట్ జాన్సన్ ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చింది. ఆమెను షాహీద్ ఎంత ఇష్టపడేవారంటే..

ఆమె స్నానం చేస్తుంటే చూడాలని
ఓ ఇంటర్వ్యూలో షాహీద్ చిలిపి ప్రశ్న అడిగారు. నీవు ఇతరులకు కనిపించకుండా మిస్టర్ ఇండియా మాదిరిగా అదృశ్యమయ్యే వరం వస్తే.. ఎవరు స్నానం చేస్తుండగా చూడాలనుకొంటావు అని అడిగారు. అందుకు అలాంటి వరం వస్తే అమ్మాయి స్నానం చేస్తుండగా నేను ఎందుకు చూడాలనుకొంటాను. అంతకంటే ఏదో గొప్ప కోరిక మనసులో కలగుతుంది కదా అని తుంటరి జవాబిచ్చారు. ఒకవేళ అలాంటి కోరిక కలిగితే ఎవరిని చూస్తావనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ అని చెప్పారు. ఆమె చాలా హాట్. బాగా ఇష్టపడుతాను అని షాహీద్ అన్నారు.

ఆమె పెళ్లి బ్రేకప్ కావాలని
ఇటీవల కరణ్ జోహర్ షోలో నీ గురించి నీవు ఇష్టపడే రూమర్ ఏమిటీ అనే ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నా వల్ల స్కార్లెట్ జాన్సన్ పెళ్లి బ్రేకప్ జరిగింది అనే వార్త వస్తే చాలా సంతోషపడుతాను అని చెప్పారు. ఎందుకని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆమె అంటే నాకు ప్రాణం. ఆమె అంటే ఇష్టం ఉండని వారెవరూ ఉండరు అని షాహీద్ కపూర్ అభిప్రాయపడ్డారు.

స్కార్లెట్ జాన్సన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు
బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ మీడియా ఇంటర్వ్యూల సందర్బంగా చాలా తుంటరిగా స్పందిస్తుంటారు. ఓ ఇంటర్వ్యూ ఆరంభంలో మీరు స్కార్లెట్ జాన్సన్‌తో డేటింగ్ చేస్తున్నారనే ప్రశ్న అడగండి.. అంటూ షాహీద్ తనపై తాను సెటైర్ వేసుకొన్నాడు. నేను ఇష్టపడే ఏకైక హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్. ఆమె గురించి ప్రస్తావన లేకుండా ఇంటర్వ్యూ సాగితే అందులో మజా ఉండదు అని షాహీద్ అన్నారు.

కబీర్ సింగ్‌గా షాహీద్ కపూర్
ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తున్న అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమాలో బ్లాక్ విడో పాత్రలో స్కార్లెట్ జాన్సన్ అద్భుతమైన భావోద్వేగాన్ని పండించారు. కాగా షాహీద్ కపూర్ ప్రస్తుతం కబీర్ సింగ్ సినిమాతో రెడీగా ఉన్నారు. తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డిని హిందీలో ఆ పేరుతో రూపొందించారు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా వ్యవహరించడం తెలిసిందే. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది. జూన్ 21న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.


Click it and Unblock the Notifications











