స్టార్ హీరో సోషల్ మీడియా హ్యక్డ్.. హీరోయిన్‌కి 'ఐ లవ్ యూ' అంటూ మెసేజ్!
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ సైబర్ క్రైమ్ భాదితుడిగా మారాడు. ఆయన సోషల్ మీడియా విభాగం హ్యాకింగ్ కు గురైంది. ఇటీవల కాలంలో పలువురి సెలెబ్రిటీల ట్విట్టర్ అకౌంట్స్ హ్యాకింగ్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజగా షాహిద్ కపూర్ ట్విటర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఆయన సోషల్ మీడియా విభాగం నుంచి కొన్ని చెత్త ట్వీట్స్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కత్రినాకు లవ్ ప్రపోజల్
హ్యాకర్స్ షాహిద్ కపూర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కొన్ని చెత్త ట్వీట్స్ చేశారు. ఓ ట్వీట్ లో ఏక్ థా టైగర్ చిత్రంలోని సాంగ్ పోస్ట్ చేసి ఐ లవ్ యూ కత్రినా అంటూ కామెంట్ పెట్టారు. మరో ట్వీట్ లో డోనాల్డ్ ట్రంప్ వీడియో పోస్ట్ చేసి మనం గెలుస్తాం అంటే కామెంట్ పెట్టారు.

ఇంస్టాగ్రామ్ కూడా
షాహిద్ కపూర్ ఇంస్టాగ్రామ్ కూడా హ్యాకింగ్ కు గురైంది. ఇంస్టాగ్రామ్ లో కూడా కత్రినా కైఫ్ ఫోటో పోస్ట్ చేసి ఐ లవ్ యూ అనే మెసేజ్ పెట్టారు. ఈ ట్వీట్స్ వైరల్ కావడంతో షాహిద్ కపూర్ వెంటనే అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.

అన్నీ బ్లాక్
సోషల్ మీడియా విభాగం హ్యాకింగ్ బారీన పడిందని తెలియగానే షాహిద్ అన్ని అకౌంట్స్ ని తాత్కాలికంగా బ్లాక్ చేశాడు. ఈ విషయంలో అభిమానులంతా షాహిద్ కపూర్ కు అండగా నిలుస్తున్నారు. తన సోషల్ మీడియా తిరిగి యాక్టీవ్ అయ్యేంతవరకు ఫ్యాన్స్ వేచి ఉండాలని సూచించాడు.

వాళ్ళ పనే
పాకిస్థాన్ కు మద్దత్తు తెలిపే టర్కిష్ సైబర్ ఆర్మీ షాహిద్ సోషల్ మీడియాని హ్యాక్ చేసి ఉంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొన్ని ట్వీట్స్ టర్కిష్ భాషలో కూడా ఉండడం గమనార్హం.


Click it and Unblock the Notifications











