వీడియో: చైతుకన్నా సమంత పెద్దది.. తనపై తానే సెటైర్ వేసుకున్న నాగచైతన్య!

అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13 న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

తాజాగా విడుదల చేసిన ప్రోమో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో అను ఇమ్మాన్యుయేల్, నాగ చైతన్య మధ్య ఫన్నీ సంభాషణని చూపించారు. సమంత గురించి నాగ చైతన్య చెప్పిన డైలాగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ' ఏ మాయ చేశావే చిత్రంలో చైతు కంటే సమంత పెద్దది. అయినా కూడా ప్రేమ పుట్టలా, పెళ్లి కాలా, సినిమా సూపర్ హిట్ కాలా అంటూ చైతు తనపై తానే సెటైర్ వేసుకున్నాడు.

 Shailaja Reddy Alludu Dialogue Promo

రియల్ లైఫ్ లో కూడా సమంత, చైతు ప్రేమికులగా మారి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శైలజారెడ్డి చిత్రంలో సీనియర్ నటి రమ్య కృష్ణ అత్త పాత్రలో నటించింది. శైలజారెడ్డి చిత్రంపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X