Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Ram Pothineni ఫెర్ఫార్మెన్స్ విక్రమ్ రేంజ్.. తుఫాన్ అంటూ డైరెక్టర్ శంకర్, శివ ప్రశంసల వర్షం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్‌లో వస్తున్న ది వారియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలోని సత్యం థియేటర్‌లో అంగరంగవైభవంగా జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వేడుక కోసం తమిళ పరిశ్రమకు సంబంధించిన అతిరథ మహామహులు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు మణిరత్నం, శంకర్, భారతీరాజా, శివ, కార్తీక్ సుబ్బరాజు హాజరయ్యారు. నటులు సూర్య, పార్థీబన్, విశాల్, ఆర్య తదితరులు పాల్గొన్నారు. తొలిసారి తమిళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న రామ్‌కు ఘన స్వాగతం పలికారు.
చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. రామ్ పోతినేని ఎనర్జీ, పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ నటన, ఫెర్ఫార్మెన్స్ చూస్తే విక్రమ్ ఫెర్ఫార్మెన్స్ గుర్తుకు వస్తున్నది అని అన్నారు. ఇక రామ్ ఫెర్ఫార్మెన్స్ తుఫాన్‌లా ఉంటుందని డైరెక్టర్ శివ అన్నాడు.

జూలై 14వ తేదీన రిలీజ్ అవుతున్న ది వారియర్ సినిమాలో ఆది పినిశెట్టి విలన్‌గా పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నారు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకులు, నటులు ఆకాంక్షించారు.