twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రైతులుగా మారి స్ఫూర్తినింపారు.. శర్వానంద్ పోస్ట్ వైరల్

    |

    శర్వానంద్ శ్రీకారం సినిమాకు టాక్ ఎంత బాగా వచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే టాక్ వచ్చినంత పాజిటివ్‌గా కలెక్షన్లు మాత్రం రావడం లేదు. కమర్షియల్‌గా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆడటం లేదని తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కలు చూస్తుంటే ఈ వారం జాతి రత్నాలు సినిమానే గెలిచేలా ఉంది. శ్రీకారం రెండో స్థానానికే పరిమితమయ్యేలా ఉంది. మొత్తానికి శ్రీకారం మాత్రం ఓ మంచి ప్రయత్నంగా అందరి మన్నలను అందుకుంటోంది.

    సామూహిక వ్యవసాయం చేయాలి.. రైతు అని గర్వంగా చెప్పుకునే రోజు రావాలి.. రైతు కొడుకు రైతే కావాలి అనే నినాదాన్ని బాగానే ప్రమోట్ చేశారు. సినిమాలో ఇచ్చిన సందేశాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ మెసెజ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీకి స్ఫూర్తిగా నిలిచిన వారు అంటూ కొంతమందిని శర్వానంద్ చూపించాడు. ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.

     Sharwanand About Real Life Educated and Employed people who turned into Farmers

    అందులో పలు రాష్ట్రాల నుంచి కొందరు వ్యక్తులు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుని రైతులుగా మారారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయిన వ్యక్తులు రైతులుగా మారి సేద్యం చేశారు. ఈ మేరకు వారందరినీ పరిచయం చేశాడు. నిజ జీవితంలో చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగం చేసిన వ్యక్తులు అందరూ కూడా రైతులుగా మారారు. శ్రీకారం సినిమాకు వీరే స్ఫూర్తిదాతలు అంటూ శర్వానంద్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

    English summary
    Sharwanand About Real Life Educated and Employed people who turned into Farmers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X