twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన హీరో శర్వానంద్

    |

    టాలీవుడ్ హీరో శర్వానంద్ '96' రీమేక్ షూటింగులో భాగంగా స్కై డైవింగ్‌లో శిక్షణ తీసుకుంటుండగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భుజానికి తీవ్రమైన గాయం అవ్వడంతో పాటు కాలుకు ఫ్యాక్చర్ అయింది. వెంటనే అతడిని థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్‌కు తరలించగా జూన్ 17న సన్‌షైన్ ఎండీ గురువారెడ్డి ఆధ్వర్యంలో భుజానికి సర్జరీ చేశారు.

    తాజాగా సమాచారం ప్రకారం శర్వానంద్ శుక్రవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయినట్లు తెలుస్తోంది. 2 నెలల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని, భుజం గాయం నుంచి కోలుకోవడానికి ఫిజియోథెరపీ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

    Sharwanand discharged from the hospital

    శర్వానంద్ సర్జరీపై డాక్టర్ గురువారెడ్డి ఇటీవల ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ''ప్ర‌మాదంలో అతడి షోల్డ‌ర్ బోన్ ఫ్రాక్చ‌ర్ అయ్యింది. మా వైద్య బృందం క‌మ‌లాక‌ర్‌, సుబ్ర‌మ‌ణ్యం, చంద్ర‌శేఖ‌ర్‌, ప్లాస్టిక్ స‌ర్జ‌న్ భ‌వానీ ప్ర‌సాద్‌, ఎన‌స్త‌టీషియా గిరిధ‌ర్ స‌హా నా ఆధ్వ‌ర్యంలో ఐదు గంట‌ల పాటు శ‌స్త్ర చికిత్స, అనంతరం మూడున్నర గంటలు అబ్జర్వేషన్‌లో పెట్టాం. బోన్ ఫ్రాక్చ‌ర్ ఐదారు ముక్క‌లుగా ఉండ‌టం వ‌ల్ల చాలా టైం ప‌ట్టింది. అయితే ఆప‌రేష‌న్ స‌క్సెస్‌ను ఫుల్‌గా పూర్తి చేశాం. త్వరలోనే కోలుకుంటారు'' అన్నారు.

    వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం ఆగస్టు నెల తర్వాతే శర్వానంద్ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు '96' మూవీ రీమేక్ నిలిపి వేయనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. తమిళ హిట్ మూవీ 96 చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు తెలుగులో శర్వానంద్, సమంత జంటగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Sharwanand has been discharged from the hospital friday evening. He has been advised rest and physiotherapy for at least 2 months.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X