Sharwanand: మాజీ మంత్రి మనువరాలితో శర్వానంద్ నిశ్చితార్థం.. వధువు వివరాలు ఏంటంటే?

చిన్న చిన్న క్యారెక్టర్లతో సినీ ప్రయాణం ప్రారంభించాడు శర్వానంద్. ఆ తర్వాత మంచి కాన్సెప్ట్ కథలను ఎంచుకుని హీరోగా మారాడు. ప్రస్థానం సినిమాతో పాపులర్ అయిన శర్వానంద్ కు గమ్యం సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. అనంతరం రన్ రాజా రన్, శతమానం భవతి వంటి తదితర చిత్రాలతో హిట్ కొట్టిన శర్వానంద్ తర్వాతి కాలంలో వరుస పరాజయాలు చవిచూశాడు.

ఇటీవల మాత్రం ఒకే ఒక జీవితం సినిమాతో మరో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ బ్యాచ్ లర్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ పెళ్లి గురించి ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఎంగేజ్ మెంట్ ఫొటోలో నెట్టింట్లో వైరల్ గా మారాయి.

 5 ఫ్లాప్ ల తర్వాత..

5 ఫ్లాప్ ల తర్వాత..

ప్రస్థానం, గమ్యం సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందని శర్వానంద్ రన్ రాజా రన్, శతమానం భవతి, ఒకే ఒక జీవితం వంటి తదితర చిత్రాలతో హిట్ కొట్టాడు. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ టైమ్ ట్రావెల్ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా.. అక్కినేని అమల కీలక పాత్ర పోషించారు.

వరుసగా ఐదు ఫ్లాప్ లు చవిచూసిన శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

సోషల్ మీడియాలో రూమర్స్..

సోషల్ మీడియాలో రూమర్స్..

ఇదిలా ఉంటే టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లో ఎక్కువగా వినిపించే పేర్లు ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అయితే.. మరొకటి శర్వానంద్. ప్రభాస్, శర్వానంద్ ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా పెళ్లి ఎప్పుడు అనే వార్త కచ్చితంగా ఉంటుంది.

ఇక వీళ్ల పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అంతా ఇంతా కాదు. ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పెళ్లి శర్వానంద్ ను పెళ్లి గురించి అడిగితే.. ప్రభాస్ తర్వాత అని చెప్పి తప్పించుకున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ కంటే ముందుగా..

ప్రభాస్ కంటే ముందుగా..

ప్రభాస్ తర్వాతే పెళ్లి అని చెప్పిన శర్వానంద్ డార్లింగ్ కంటే ముందు పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్తలు వినిపించాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో అనేకమైన మీమ్స్ వచ్చి నెటిజన్లను నవ్వించాయి. అయితే శర్వానంద్ పెళ్లికి సంబంధించి హీరో నుంచి కానీ అతని ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా శర్వానంద్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు బయటకు రావడం విశేషంగా మారింది.

రామ్ చరణ్-ఉపాసన హాజరు..

రామ్ చరణ్-ఉపాసన హాజరు..

శర్వానంద్ పెళ్లి చేసుకునే అమ్మాయి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి అని ఇదివరకు వచ్చిన వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న రక్షిత రెడ్డితో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన హాజరయ్యాయి. ప్రస్తుతం శర్వానంద్ నిశ్చితార్థం ఫొటోలు వైరల్ అయ్యాయి. శర్వానంద్ జంట చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

మాజీ మంత్రి మనువరాలు..

మాజీ మంత్రి మనువరాలు..

రక్షిత రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాగా.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని తెలుస్తోంది. అంతేకాకుండా.. రక్షిత రెడ్డి ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ మనువరాలని సమాచారం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్న రక్షిత రెడ్డి కొవిడ్ ప్రభావంతో ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుందని సమాచారం. అయితే శర్వానంద్ ది లవ్ కమ్ అరెంజ్డ్ మ్యారేజ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

లవ్ మ్యారేజ్ అంటూ..

లవ్ మ్యారేజ్ అంటూ..

ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పి శర్వానంద్ తన ఇంట్లో వాళ్లను ఒప్పించాడని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. అయితే రక్షిత రెడ్డిని శర్వానంద్ ఎక్కడ.. ఎలా.. ఎప్పుడు కలిశాడు.. ఇదంతా ఎప్పుడు జరిగిందని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయం గురించి శర్వానంద్ నుంచి గానీ, వాళ్ల కుటుంబం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ సోషల్ మీడియాలో వాళ్ల నిశ్చితార్థం పిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X