For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మొదటిసారి లిప్ లాక్ ఇచ్చిన శర్వానంద్.. అప్పుడు రిజెక్ట్ చేసి ఇప్పుడు ఆ హీరోయిన్ తో ఘాటుగా..

  |

  సినిమా ఇండస్ట్రీలో రొమాన్స్ విషయంలో హీరో హీరోయిన్స్ కొంతవరకు లిమిట్స్ లో ఉంటారనే చెప్పాలి. మొదట్లో ఉన్నట్లుగా కొందరు ఆ తర్వాత ఉండకపోవచ్చు. మరికొందరు మాత్రం మొదటి నుంచి కూడా రొమాన్స్ విషయంలో మాత్రం హద్దులు దాటకుండా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు కథ డిమాండ్ చేస్తే మాత్రం హద్దులు దాటకుండా ఉండలేకపోతారు. ఇటీవల శర్వానంద్ కూడా మొదటి సారి తన గీతను దాటాల్సి వచ్చిందట. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శర్వానంద్ గతంలో ఎప్పుడూ లేని విధంగా లిప్ లాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

  Avika Gor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన చిన్నారి పెళ్లి కూతురు హీరోయిన్.. ప్రైవేటు పార్టులో టాటూను చూపిస్తూ!

  నెగిటివ్ ఫ్యాన్స్ లేకుండా

  నెగిటివ్ ఫ్యాన్స్ లేకుండా

  ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శర్వానంద్ ఉంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమైన హీరో. ఈ హీరోకు కూడా నెగిటివ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉండరు. సీనియర్ హీరో వెంకటేష్ ఎలాగైతే తనకంటూ ఒక ప్రత్యేకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక నేటి తరం యువ హీరోల్లో శర్వానంద్ కూడా అదే తరహాలో మంచి గుర్తింపును అందుకున్నాడు. ఎప్పుడైనా సరే అతను ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతాడు.

  హైలెట్ గా ఉండేలా..

  హైలెట్ గా ఉండేలా..

  శర్వానంద్ కెరీర్ మొదటి నుంచి కూడా విబిన్నంగానే ఆలోచిస్తూ అద్భుతమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంతవరకు అతను చేసిన ప్రతి సినిమా కథలో ఏదో ఒక కొత్త పాయింట్ హైలెట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సింపుల్ ప్రేమ కథలు ఫ్యామిలీ కథలు రాసుకునే దర్శకులు కూడా ఎక్కువగా శర్వానే సెలెక్ట్ చేసుకుంటున్నారు.

  అయితే కేవలం అదే తరహాలో కాకుండా మధ్య మధ్యలో కొన్ని యాక్షన్ సినిమాలను కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతను మహాసముద్రం సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

  ట్రేడింగ్ 1లో ట్రైలర్

  ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ స్థాయిలో విజయం అందుకున్నటువంటి యువ దర్శకుడు అజయ్ భూపతి రెండవ సినిమా మహాసముద్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా యూట్యూబ్ లో టాప్ 1 ట్రెండింగ్ లో చేరిపోయింది. ఇక ఈ ట్రైలర్ ఈ సినిమాలో శర్వానంద్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు.

  మొదటిసారి లిప్ లాక్

  మొదటిసారి లిప్ లాక్

  అయితే ఈ సినిమా ద్వారా మొదటిసారి లిప్ లాక్ సీన్ లో నటించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన ప్రేమకథా నటించాడు అయితే ఇప్పుడు కూడా లిప్ లాక్ సీన్స్ లలో నటించింది లేదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా మూవీ మొదట శర్వానంద్ తోనే చేయాలని అనుకున్నారు. కానీ ఆ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండడం వలన ధైర్యం చేయలేకపోయాడు. అప్పటివరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవ్వడం వలన శర్వా ఆ తరహా సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాడు.

  హాలీవుడ్ సినిమాలో మంచు లక్ష్మి !
  మరింత కొత్తగా..

  మరింత కొత్తగా..

  అయితే ఇప్పుడు మాత్రం మహాసముద్రం సినిమా కోసం మాత్రం ముద్దు సన్నివేశాల్లో నటించడం హాట్ టాపిక్ గా మారింది. గ్లామరస్ హీరోయిన్ అదితి రావు హైదరి తో ముద్దు సన్నివేశం ట్రైలర్ లో కూడా హైలెట్ గా కనిపించింది. దీంతో ఈ సినిమాలో శర్వా మరింత కొత్తగా కనిపించబోతున్నాడని అనిపిస్తోంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి దర్శకుడు అజయ్ భూపతి ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి. గత కొంత కాలంగా అపజయాల్లో ఉన్న శర్వానంద్ కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు.

  English summary
  Sharwanand first time liplock scene in maha samudram movie..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X