థ్రిల్లర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టాలెంటెడ్ హీరో శర్వానంద్
టాలెంటెడ్ యువ శర్వానంద్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న శర్వానంద్ జయాపజయాలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అవసరం అయితే రెమ్యునరేషన్ తక్కువ తీసుకొని మంచి సినిమాను పూర్తి చేయాలని అనుకునే అతికొద్ది మంది నటీనటులలో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం ఈ హీరో శ్రీకారం సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే.
చాలా కాలం తరువాత పూర్తి తరహా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అది. అయితే ఆ సినిమాతో పాటు ఆర్ఎక్స్100% దర్శకుడు అజయ్ భూపతితో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. మహాసముద్రం అనే ఆ సినిమాలో సిద్దార్థ్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. సీరియస్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా కథను మొదట పలువురు హీరోలు చేయడానికి వెనుకడుగు వేశారు.

ఇక శర్వానంద్ ఒక్కడే రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక త్వరలో కోన వెంకట్ రాసిన ఒక థ్రిల్లర్ కథలో కూడా శర్వానంద్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన రూమర్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కథను డైరెక్ట్ చేసేది ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కోన వెంకట్ తన హోమ్ బ్యానర్ లోనే సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి శర్వానంద్ కు ఆ సినిమా ఎంతవరకు హిట్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











