శర్వానంద్ పెళ్లి కోసం గ్రాండ్ ప్లానింగ్.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బ్యాచిలర్ హీరోలు ఒక్కొక్కరు కూడా దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అసలు పెళ్లి అంటేనే పారిపోయే యువ హీరోలు ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిలను చూపిస్తూ షాక్ ఇస్తున్నారు. ఇక శర్వానంద్ కూడా పెళ్లికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక అతని పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ఎంగేజ్మెంట్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన శర్వానంద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కు, రక్షిత రెడ్డితో ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న ఆయన అందరికీ షాకిచ్చారు. అతి కొద్ది మంది స్నేహితులు, టాలీవుడ్ నటీనటుల మధ్య ఈ జంట ఉంగరాలు మార్చుకుంది. అయితే నిశ్చితార్థానికి, పెళ్లికి కాస్త గ్యాప్ వచ్చినా తాజాగా వీరి పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

జూన్ 3వ తేదీన రాజస్థాన్‌లో పెళ్లి: గ్లామరస్ తెలుగు చిత్ర పరిశ్రమలో మరో జంటకు పెళ్లి బాజాలు మోగడంతో.. అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుప్రసిద్ధ నటుడు శర్వానంద్, అతనికి కాబోయే భార్య రక్షిత రెడ్డిలు మూడు ముళ్ల బంధంతో తమ జీవితంలో కొత్త అధ్యాయానికి స్వాగతం పలకబోతున్నారు. ఈ జంట జూన్ 3వ తేదీన రాజస్థాన్‌లోని జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఏడడుగుల బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది.

రెండు రోజుల పాటు ఘనంగా: అయితే శర్వానంద్, రక్షితల పెళ్లికి సంబంధించిన పెళ్లి పత్రికలు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. రెండు రోజుల పాటు ఘనంగా వీరి పెళ్లి జరగ బోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీన మెహందీ వేడుకను జరపబోతున్నారట. ఆ మరుసటి రోజే శర్వానంద్ ను పెళ్లి కొడుకును చేస్తారట. అదే రోజు అంటే జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో రక్షితతో శర్వానంద్ వివాహం జరగనుంది.
రోజుకు 4 కోట్ల రూపాయలు చెల్లించనున్నారట: రాత్రి 11 గంటల నుంచి వివాహ వేడుక ప్రారంభం అవుతుంది. జూన్‌లో జరిగే తన పెళ్లి కోసం.. శర్వా పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. లీలా ప్యాలెస్ లో జరిగే ఈ వేడుకలకు గాను ఆయన... రోజుకు 4 కోట్ల రూపాయలు చెల్లించనున్నారట. కేవలం ప్యాలెస్ కే ఇంత మొత్తంలో చెల్లిస్తే.. మిగతా విషయాల్లో ఇంకెంత మొత్తం ఖర్చు చేస్తున్నారో అని అంతా అనుకుంటున్నారు. జీవితంలో ఒక్కసారి జరిగే పెళ్లికి ఈ మాత్రం ఖర్చు చేస్తే తప్పేం లేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇంత గ్యాప్ రావడానికి కారణం..: అయితే వీరిద్దరి పెళ్లి ఎలా జరగనుందో, ఎవరెవరు హాజరు కానున్నారు వంటి విషయాలు తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. జనవరిలో వీరి ఎంగేజ్ మెంట్ జరగ్గా.. జూన్ లో పెళ్లికి ముహూర్తం ఖరారు అయింది. ఇంత గ్యాప్ రావడానికి కారణం శర్వానంద్ ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వా ఓ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











