శర్వానంద్ న్యూ మల్టీస్టారర్.. మరో హీరోగా ఓల్డ్ లవర్ బాయ్!
టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా ఏం రేంజ్ లో నడుస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిన్న హీరోలు పెద్ద హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు మల్టీస్టారర్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇకపోతే శర్వానంద్ కూడా మరో మల్టీస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.
గత కొంత కాలంగా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మహా సముద్రం అనే కథను పట్టుకొని ఇండస్ట్రీలో ప్రతి హీరో చుట్టూ తిరుగుతున్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ గా ఆ కథకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరొక హీరోగా ఒకప్పటి లవర్ బాయ్ సిద్దార్థ్ నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దార్థ్ మొదటి సక్సెస్ అందుకుంది తెలుగులోనే అయినప్పటికీ ఇక్కడ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు.

ప్రస్తుతం ఈ సీనియర్ హీరో తమిళ్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఇక చాలా కాలం తరువాత మహా సముద్రం కథకు ఇంప్రెస్ అయిన సిద్దార్థ్ నటనకు మంచి స్కోప్ ఉన్న కథ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే సిద్దార్థ్ - శర్వానంద్ మల్టీస్టారర్ బిగ్ స్క్రీన్ పై ఎంతవరకు సెట్టవుతుందనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











