అప్పుడు నాగార్జున చేసినట్లే.. ఇప్పుడు శర్వానంద్ కూడా.. ‘మహర్షి’ని మించిపోతుందట

అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. స్వతహాగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలో ఎన్నో పరాజయాలను చూసినప్పటికీ తట్టుకుని నిలబడ్డాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'రణరంగం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడీ టాలెంటెడ్ హీరో.

ఇందులో భాగంగానే ప్రస్తుతం తమిళ చిత్రం '96' రీమేక్‌లో నటిస్తున్నాడు. దిల్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది పట్టలపై ఉండగానే శర్వానంద్ మరో సినిమాకు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.

Sharwanand Play Farmer Role In Sreekaram

కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న 'శ్రీకారం' అనే సినిమాలో శర్వానంద్ నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కొద్దిరోజుల క్రితం జరిగాయి. ప్రస్తుతం '96' రీమేక్‌లో పాల్గొంటూనే.. మరోవైపు, ఈ సినిమాకూ డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. ఈ తరుణంలో 'శ్రీకారం' గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

ఈ సినిమా వ్యవసాయం ఆధారంగా సాగుతుందనేదే ఆ వార్త సారాంశం. ఇందులో శర్వా రైతులా కనిపించనున్నాడని తెలుస్తోంది. 1996లో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన 'రాముడొచ్చాడు' సినిమాలోలా ఇందులోనూ శర్వా హైటెక్ వ్యవసాయం చేస్తాడని అంటున్నారు. అలాగే, మహేశ్ బాబు నటించిన 'మహర్షి' సినిమాను మించిన కంటెంట్‌ను టచ్ చేయబోతున్నారని కూడా ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మంచి స్క్రిప్టుతో శర్వానంద్ రాబోతున్నాడని తెలిసింది. మరి ఇదైనా అతడిని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X