తమిళ్ సినిమాలపై శర్వానంద్ స్పెషల్ ఫోకస్.. ఖైదీ గ్యాంగ్‌తో న్యూ ప్రాజెక్ట్!
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ గతకొంతకాలంగా వరుస అపజయాలతో కాస్త ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. 2017లో చివరగా మహానుభావుడు సినిమాతో సక్సెస్ అందుకున్న శర్వానంద్ ఆ తరువాత సరైన సక్సెస్ అందుకోలేదు. వరుసగా మూడు సినిమాలు దెబ్బకొట్టాయి. పడి పడి లేచే మనసు సినిమాతో పాటు రణరంగం, జాను సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.
ఆ మూడు సినిమాలు మినిమామ్ వసూళ్లను కూడా అందుకోలేకపోయాయి. నిర్మాతలకు భారీ నష్టాలను కలిగించాయి. దీంతో నెక్స్ట్ శ్రీకారం అనే సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఆ సినిమా వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో రానుంది. ఇక ప్రస్తుతం ఈ యువ హీరో తమిళ్ సినిమాలపై కూడా స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో జర్నీ సినిమాతో తమిళ్ లో కూడా ఈ హీరో మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఇక చాలా రోజుల తరువాత వరుసగా తమిళ్ కథలను కూడా ఒకే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడితో ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. తమిళ్ తెలుగులో ఒకేసారి తెరకెక్కుతున్న ఆ సినిమాను కార్తీ ఖైదీ నిర్మాతలు రూపొందిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఖైదీ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ తోనే శర్వా మరొక సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి తమిళ్ లో ఈ హీరో ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











