శర్వానంద్ కూడా మొదలెట్టేశాడు.. సెట్స్‌లో బిజీబిజీగా!!

యంగ్ హీరో శర్వానంద్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రత్యేకంగా నిలుస్తాడు. శర్వానంద్ సినిమా వస్తుందంటే అందరిలోనూ ఓ ఆసక్తి ఉంటుంది. కమర్షియల్ హంగులకు దూరంగా కొత్తగా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. అయితే గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారు. పడి పడి లేచే మనసు, రణరంగం వంటివి మిశ్రమ ఫలితాన్ని ఇవ్వడంతో శర్వానంద్ ఆలోచనలో పడ్డాడు.

అయినా సరే శర్వానంద్ తన పంథాను వదల్లేదు. కొత్త కథలతో ప్రయోగం చేయాలనే నిర్ణయంతోరనే ఉన్నాడు. ప్రస్తుతం శర్వా చేతిలో పలు ప్రాజెక్ట్‌లున్నాయి. ఓ ద్విభాషా చిత్రం, శ్రీకారం అనే మరో ప్రాజెక్ట్ సెట్స్ మీదున్నాయి. అయితే తాజాగా ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతితో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశాడు. మహా సముద్రం అంటూ మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. తాజాగా లాక్ డౌన్ వంటి గ్యాప్ తరువాత శర్వా కూడా సెట్స్ మీదకు వెళ్లాడు.

sharwanand starts shoot with Shree Karthick

ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో షూటింగ్‌ల సందడి మొదలైంది. చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలన్నీ సెట్స్ పైకి మీదకు వచ్చాయి. ప్రభాస్ కూడా ఇటలీకి వెళ్లాడు. తాజాగా శర్వా కూడా సెట్స్ పైకి వచ్చేశాడు. కార్తీ ఖైదీ చిత్రాన్ని నిర్మించిన ప్రభు నిర్మిస్తున్న ద్విభాషా చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీ కార్తిక్ తెరకెక్కిస్తూ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఈ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమైనట్టు సెట్‌లో అడుగుపెట్టినట్టు ప్రకటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X