అపజయాలు వచ్చినా తగ్గని శర్వానంద్ హవా.. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాకి భారీ ఆఫర్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ నటీనటులలో శర్వానంద్ ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత మెల్లగా తన స్థాయిని పెంచుకునే విధంగా మరి కొన్ని మంచి సినిమాలు చేశాడు. ఇండస్ట్రీలో ఒక మంచి వాడి పాత్రలకు సరిపోయే హీరో ఎవరు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం శర్వానంద్ అని చెప్పాలి. ఎప్పుడు చూసినా పాజిటివ్ గా కనిపించే శర్వానంద్ ఇటీవల కాలంలో మాత్రం వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. ఇక శర్వానంద్ కు అపజయాలు ఎన్ని వస్తున్నా కూడా రావాల్సిన సినిమాలు మాత్రం అతనికి వస్తున్నాయి. ఏదో ఒక సినిమా తో శర్వానంద్ నిత్యం బిజీగా కనిపిస్తూనే ఉన్నాడు.
ఇక అతని నుంచి నెక్స్ట్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమా రానుంది. సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. శర్వానంద్ గత ఐదేళ్ల నుంచి ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి. 2017లో మహానుభావుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత శర్వానంద్ ఎలాంటి సినిమా చేసినా కూడా వరుస పరాజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సాయి పల్లవి తో చేసిన పడి పడి లేచే మనసు అలాగే రణరంగం సినిమా జాను, శ్రీకారం ఇలా వరుసగా శర్వా ఫెయిల్యూర్స్ చూస్తూనే ఉన్నాడు.

ఇక అతని నుంచి చివరగా వచ్చిన మహాసముద్రం సినిమా కూడా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో సిద్ధార్థ కూడా మరొక హీరో గా కనిపించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కకుండా పోయింది. సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన నష్టాలను మిగిల్చింది. అయితే ఇప్పుడు శర్వా తన నమ్మకాన్ని మొత్తం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాపైనే పెట్టుకున్నాడు. నేను శైలజ చిత్రలహరి వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక త్వరలోనే విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే రీసెంట్ గా సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నాన్ థియేట్రికల్ గా 25 కోట్లకు పైగా లాభాలను అందించినట్లు సమాచారం. ఓటీటీ శాటిలైట్ డబ్బింగ్ హక్కుల ద్వారా సినిమాకు మంచి ప్రాఫిట్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఆ రోజు భీమ్లా నాయక్ కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











