Vedha కంటతడి పెట్టిన శివ రాజ్‌కుమార్.. ఓదార్చిన నందమూరి బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ తన కెరీర్‌లో 125వ చిత్రంగా నటించిన శివ వేద సినిమా భారీ విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. శివ రాజ్ కుమార్ భార్య గీతా శివ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాంటి సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కలకత్తా కాళి క్రియేషన్స్ ద్వారా నిర్మాత యంవీఆర్ కృష్ణ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివ రాజ్ కుమార్, ఆయన భార్య గీత కంటతడితో ఈ వేడుక భావోద్వేగంతో సాగింది. ఈ వేడుక వివరాల్లోకి వెళితే..

ప్రజల గుండెల్లో పునీత్ రాజ్‌కుమార్ అంటూ బాలయ్య

ప్రజల గుండెల్లో పునీత్ రాజ్‌కుమార్ అంటూ బాలయ్య

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. శివ వేద సినిమా ట్రైలర్ బాగుంది. శివరాజ్ ఫ్యామిలీతో దర్శకుడు హర్షకు మంచి అనుబంధం ఉంది. గతంలో శివరాజ్ కుటుంబంతో భజరంగీ 1, భజరంగి 2, శివ వేద, పునీత్ రాజ్‌కుమార్‌తో అంజనీపుత్ర లాంటి సినిమాలు తీశారు. అలాగే శివరాజ్ కుమార్ కుటుంబంతో మాకు మంచి అనుబంధం ఉంది. ఆ రోజుల్లో ఎన్టీఆర్, రాజ్ కుమార్, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్‌ మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం శివ రాజ్‌కుమార్, పునీత్, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌తో మంచి అనుబంధం ఉంది. పునీత్ రాజ్‌కుమార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో స్థిరంగా ఉంటారు అని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

బాలయ్య నాకు బ్రదర్ లాంటి వారు అంటూ శివ

బాలయ్య నాకు బ్రదర్ లాంటి వారు అంటూ శివ

శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. శివ వేద ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు బాలకృష్ణ రావడం చాలా సంతోషంగా ఉంది. బాలయ్య నాకు సోదరుడి లాంటివారు. తన 100 సినిమా గౌతమీ పుత్రశాతకర్ణి సినిమాలో ఓ పాట చేస్తారా అని ఓ ఫోన్ కాల్ చేయగానే నేను ఆ పాటలో నటించాను. ఇక ముందు ఫుల్ లెంగ్త్ ఉన్న క్యారెక్టర్‌ను చేయాలని ఉంది. ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను.బాలయ్య గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఎన్టీ రామారావు, నాగేశ్వరావు గారు శివాజీ గణేషన్, ఎంజీఆర్ గారు ఇలా అందరూ బ్రదర్ లాగా ఉండే వాళ్ళు. వారు ప్రతి సినిమాను వాళ్లు షేర్ చేసుకునే వారు. సౌత్ ఇండియాలో అప్పటి నుంచే చాలా ఫ్రెండ్లీగా ఉంది. శివ వేద సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్నది. కచ్చితంగా మీకు నచ్చుతుంది అని అన్నారు.

పునీత్ రాజ్‌కుమార్ వీడియో చూసి..

పునీత్ రాజ్‌కుమార్ వీడియో చూసి..

ఇక శివ వేద సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ సందర్భంగా పునీత్ రాజ్‌కుమార్ ఆడియో, విజువల్ వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిన్ననాటి పునీత్, శివ రాజ్ కుమార్‌కు సంబంధించిన సన్నివేశాలు అందర్నీ భావోద్వేగానికి గురిచేశాయి. అలాగే శివ రాజ్ కుమార్, పునీత్ కలిసి పాడిన పాట తెర మీద కనిపించగానే అందరూ ఎమోషనల్ అయ్యారు. ఓ దశలో శివ రాజ్ కుమార్, గీత శివ రాజ్ కుమార్ కంటతడి పెట్టారు. దాంతో శివ రాజ్ కుమార్ భుజంపై చేయి వేసి.. బాలకృష్ణ ఓదార్చారు.

స్టెప్పులేసి కేక పెట్టించిన శివ రాజ్ కుమార్

స్టెప్పులేసి కేక పెట్టించిన శివ రాజ్ కుమార్

శివ వేద సినిమాలో పాడిన పాటను ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా వేదిక శివ రాజ్‌కుమార్ ఆలపించారు. పుష్ప.. పుష్ప అంటూ సాగే పాటను పాడుతూ అందర్నీ హుషారెత్తించారు. అంతేకాకుండా వేదికపై స్టెప్పులేస్తూ ప్రేక్షకుల చేత కేక పెట్టించారు. శివ రాజ్ కుమార్, బాలకృష్ణ మధ్య అనుబంధం చూసి అభిమానుల సంతోషంలో మునిగిపోయారు. శివ వేద కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా, వినోదభరితంగా సాగింది.

వేద మూవీలో తెర వెనుక, తెర ముంద

వేద మూవీలో తెర వెనుక, తెర ముంద


నటీనటులు: శివరాజ్ కుమార్, ఘనవి లక్ష్మణ్, శ్వేత చెంగప్ప, ఉమశ్రీ, అదితి సాగర్, భరత్ సాగర్ తదితరులు
రచన, దర్శకత్వం: హర్ష
నిర్మాత: గీతా శివరాజ్ ‌కుమార్
సినిమాటోగ్రఫి: స్వామి జె గౌడ్
ఎడిటర్: దీపు ఎస్ కుమార్
సంగీతం: అర్జున్‌ జన్య
పీఆర్వో: వీఆర్ మధు
డిజిటల్ మీడియా: ప్రసాద్ లింగం
బ్యానర్: జీ స్టూడియో, గీతా పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-02-09

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X