‘పవన్ కల్యాణ్ ఎవ్వరినీ వదలడు.. ఆ విషయంలో 200 శాతం నమ్మకం’
రాజు గారి గది ఫ్రాంచైజీ, హిడింబ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకొన్న యువ హీరో అశ్విన్ బాబు. తాజాగా ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో శివం భజే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేశ్వర్ రెడ్డి నిర్మాతగా రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పవన్ కల్యాణ్ గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ..
గతంలో పవన్ కల్యాణ్ ఓటమి పాలు కావడం అందర్నీ కలిచి వేసింది. ఈ సారి ఆయన గెలువాలని అందరూ కోరుకొన్నారు. కేవలం ఇండస్ట్రీ వాళ్లే కాకుండా అందరూ ఆయన పార్టీ విజయం సాధించాలని కోరుకొన్నారు. ఇండస్ట్రీలో ఆయన ఎదుగుదల చూసిన ఆయనకు అభిమానులుగా మారిన క్రమంలో రాజకీయాల్లో కూడా అలాగే ఎదగాలని కోరుకొన్నాం అని అశ్విన్ బాబు అన్నారు.

ఆంధ్రా ప్రజలు గతంలో ఓటు వేయకుండా నిరాశపరిచారు. ఈ సారి ఓటు వేసి ప్రేమను చాటుకొని డిప్యూటీ సీఎం చేశారు. పవన్ కల్యాణ్ అన్న ఏమైతే చేయాలని అనుకొన్నారో.. అవన్నీ చేస్తారు. అల్రెడీ పనులన్నీ మొదలుపెట్టారు. ప్రజల కూడా ఆయన స్పందిస్తున్న తీరుపై హర్షం వ్యక్తవుతున్నది అని అశ్విన్ బాబు అన్నారు.
పవన్ కల్యాణ్ క్యారెక్టర్, స్వభావం చూస్తే ప్రజలకు మేలు చేయాలని పరితపిస్తున్నారనేది కొత్తగా చెప్పాల్సిన విషయం ఏమీ లేదు. 200 శాతం పని చేస్తారు. ఆయన ఎవ్వరినీ, దేనిని వదిలి పెట్టరు. ఎంతో చేస్తారని పవన్ కల్యాణ్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











