విక్రమ్ కుమార్ దర్శత్వంలో నాని.. షాకిస్తున్న బడ్జెట్!
నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. నాని ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో. కానీ నాని గత ఏడాది నటించిన గత రెండు చిత్రాలు కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ కమర్షియల్ గా రాణించలేకపోయాయి. దీనితో తదుపరి చిత్రం కోసం నాని విభిన్నమైన కథని ఎంచుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శత్వం వహిస్తున్న జెర్సీ చిత్రంలో నాని క్రికెటర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత నాని ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్ర బడ్జెట్ కు సంబంధించి ఆశ్చర్యకర వార్త ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి నిర్మాతలు 50 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ నాని చిత్రం ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కలేదు. కానీ విక్రమ్ కుమార్ దర్శకత్వంపై ఉన్న నమ్మకం, నాని క్రేజ్ దృష్ట్యా అంత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

విక్రమ్ కుమార్ రూపొందించే చిత్రాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నానితో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నాని గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో నటిస్తున్న జెర్సీ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో నాని క్రికెటర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











