జెర్సీ చిత్రం విషాదాంతమా.. ఉత్కంఠ రేపుతున్న కథ!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నానికి గత ఏడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బ్రేక్ వేసాయి. వరుసగా ప్రేమ కథలు, ఎంటర్ టైనింగ్ చిత్రాలు చేస్తూ వచ్చిన నాని జెర్సీ చిత్రంతో రూటు మార్చాడు.
జెర్సీ చిత్ర కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. భారత మాజీ క్రికెటర్ రామన్ లాంబా జీవితంతో ఈ చిత్రం పోలి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రామన్ 1998లో క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతి అతడి తలకు బలంగా తగిలి మరణించాడు. క్రికెట్ చరిత్రలో ఇదొక విషాదం.

జెర్సీ చిత్రంలో కూడా అలాంటి తరహా సన్నివేశం ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జెర్సీ చిత్రం విషాదంతో ముగుస్తుందని ప్రచారం జరుగుతోంది. శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











