Prabhas ప్రాజెక్ట్ K ఆ సినిమా తరహాలో ఉంటుందా.. రీమేక్ అంటున్నారే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రానటువంటి సరికొత్త కథాంశంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే నిర్మాత చెప్పుకొచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రాజెక్ట్ కె మూవీ సంచలనం సృష్టిస్తుంది అని చెప్పారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమా కథ ఉండబోతోంది అని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ నేపధ్యంలో అత్యదినిక సాంకేతిక టెక్నాలజీ వాహనాలు ఈ సినిమాలో కనిపించనున్నాయి. అలాగే 2050 కాలంలో కోమసాగే కథగా ఉండబోతోందంట. ఈ మూవీలో ప్రభాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపిస్తాడనే టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీపై తాజాగా మరో రూమర్ తెరపైకి వచ్చింది. ప్రాజెక్ట్ కె ఒక హాలీవుడ్ సినిమాకి రీమేక్ అంటూ టాక్ వినిపిస్తోంది. 2013లో హాలీవుడ్ ఎలిసియం అనే మూవీ వచ్చింది. ఈ మూవీ కాన్సెప్ట్ కూడా ఫ్యూచర్ లోనే ఉంటుంది. 2054లో భూమిపై కాలుష్యం ఎక్కువైపోయి మనుషులు రోగాల బారిన పడతారు. దీంతో డబ్బున్నవాళ్ళు అందరూ కూడా వేరే గ్రహానికి వెళ్ళిపోతారు. ఇక భూమిపైన ఉన్న ప్రజలని హీరోగా కాపాడే బాద్యత తీసుకుంటాడు.
అలాగే ప్రాజెక్ట్ కె మూవీ స్టొరీ లైన్ కూడా ఇంచు మించు అలాగే ఉంటుందంట. భూమిపైన ఉన్న మనుషులని కాపాడే సూపర్ హీరోగా ప్రభాస్ పాత్ర ప్రాజెక్ట్ కె లో ఉంటుందంట. అందుకే హాలీవుడ్ రీమేక్ గానే ప్రాజెక్ట్ కె మూవీ తెరకెక్కుతుంది అనే టాక్ నడుస్తోంది. కాని అందులో వాస్తవం ఉండే అవకాశం లేదని ప్రభాస్ అభిమానులు అంటున్న మాట. ఇది కంప్లీట్ గా నాగ అశ్విన్ ఐడియాతో చేస్తున్న సినిమా అనే నమ్ముతున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











