For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అలాంటి ఫేక్‌స్టార్ కాడు.. ప్రభాస్ ఎలాంటి వాడంటే.. శృతిహాసన్ దిమ్మతిరిగే కామెంట్స్

  |

  రెబల్ స్టార్ ప్రభాస్ ఎంత పెద్ద సినిమా చేసినా కూడా పర్సనల్ గా మాత్రం ఎప్పుడు కూడా తన స్థాయిని పెంచుకోవాలని అనుకోడు. వీలైనంత వరకు సింపుల్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రభాస్ తో ప్రస్తుతం ఉన్న టీమ్ మొత్తం కూడా అతని స్నేహితులతోనే నిండి ఉంటుంది. సినిమా వర్క్ పరంగా టీమ్ లో కొత్తగా చేరేవారు కూడా డార్లింగ్ కు తొందరగా ఫ్రెండ్స్ అవుతుంటారు. అసిస్టెంట్ అయినా సరే తన ఫ్రెండ్ అనేస్తాడు. ఇక అలాంటి డార్లింగ్ గురించి ఇటీవల శ్రుతి హాసన్ కొన్ని విషయాలను చెప్పింది.

  ఎద అందాలతో హీటేక్కిస్తున్న యషికా ఆనంద్

   డార్లింగ్ తో సినిమా అంటే..

  డార్లింగ్ తో సినిమా అంటే..

  ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఇక నుంచి పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. డార్లింగ్ తో సినిమా అంటే స్టోరి వినకుండా ఓకే చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి క్యాటగిరిలో శ్రుతి హాసన్ కూడా ఉంది. ఇక షూటింగ్ లో ప్రభాస్ రియల్ క్యారెక్టర్ ను దగ్గరగా చూసిన శ్రుతి మరింత అభిమానం పెంచుకుందట.

   ఆ చిన్న టైమ్ లోనే

  ఆ చిన్న టైమ్ లోనే

  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శ్రుతి హసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ ను అనుకున్నప్పటికి కథకు ఆమె మాత్రమే సెలెక్ట్ అవుతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ శ్రుతిని ఫైనల్ చేశాడు. ఇక ఇప్పటికే కొంత షూటింగ్ ను పూర్తి చేశారు. అయితే ఆ చిన్న టైమ్ లోనే చిత్ర యూనిట్ కు శృతి హాసన్ ఫిదా అయిపోయిందట.

   అలా ఉంటాడనుకోలేదు

  అలా ఉంటాడనుకోలేదు

  ముఖ్యంగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ పొగడ్తలతో ముంచెత్తింది. ఒక బాలీవుడ్ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అతను నిరంతరం చాలా చిల్ గా ఉంటాడు. ప్రభాస్ గురించి ముందే తెలిసినప్పటికీ మరీ అంత కూల్ గా ఉంటాడని నేను ఊహించలేదు. చేసే ప్రతి వర్క్ విషయంలో నమ్మకంతో ఉంటాడు.. అని వివరించింది.

   చాలా ఉత్సాహంగా ఉంటాడు.

  చాలా ఉత్సాహంగా ఉంటాడు.

  సలార్ షూటింగ్ అనుభవాన్ని పంచుకుంటూ,శ్రుతి ఈ విధంగా మాట్లాడింది. "ప్రభాస్ గురించి అందరికి తెలిసిందే. అతను ఉంటేనే అక్కడ ఎంతో ఎనర్జి ఉంటుంది. చాలా ఉత్సాహంగా ఉంటాడు. స్టార్ ఇమేజ్ ను ఏ మాత్రం చూపించాడు..ఎప్పుడైనా సరే ఒదిగి ఉంటాడు.. అని శ్రుతి తెలిపింది.

  ప్రభాస్ ఒక్కడికే సాధ్యం

  ప్రభాస్ ఒక్కడికే సాధ్యం

  ఒదిగి ఉండే స్టార్స్ ను చాలా మంది చూశాను. కానీ అందులో నకిలీగా బిహేవ్ చేసే వాళ్ళను ఎక్కువగా చూశాను. మంచిగా ప్రవర్తించే ఫేక్ మనుషులను కూడా చూశాను. కానీ ప్రభాస్ విధానంలో నాకు కొంచెం కూడా తేడా కొట్టలేదు. అందుకే అతన్ని నేను లైక్ చేస్తున్నాను. కేవలం పర్సనల్ గానే కాకుండా వర్క్ విషయంలో కూడా చాలా కూల్ గా ఉండడం ప్రభాస్ ఒక్కడికే సాధ్యం

  ఒక పెద్ద స్టార్ అలా ఉంటే

  ఒక పెద్ద స్టార్ అలా ఉంటే

  ప్రభాస్ ఉండే విదానాన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలని అనిపించింది. నిజానికి ప్రభాస్ కు అతని రేంజ్ ఏ ఏమిటో తెలిసినప్పటికీ ఎప్పుడు కూడా ఆ స్టార్ డమ్ ను చూపించుకోడు. ఒక పెద్ద స్టార్ అలా ఉంటే.. చాలా బావుంటుంది. పని వాతావరణం కూడా అందరికి ఆహ్లాదకరంగా ఉంటుంది.. అని శ్రుతి హసన్ వివరణ ఇచ్చారు.

  English summary
  Needless to say, the range of news related to Pan India movies in the Tollywood industry has been going viral since last year. Rebel star Prabhas in particular, however, lined up a series of Pan India projects without a gap. Information that has given the green signal to another star producer according to the talk now being heard in the industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X