ఫ్రెండ్ కాదు లవరే.. శంతను గురించి ఓపెన్ అయిపోయిన శృతి హాసన్
స్టార్ హీరోయిన్ గా తెలుగులో చాలా సినిమాలు చేసిన శృతిహాసన్ ఆ మధ్య ప్రేమలో పడి సినిమాలకు దూరం అయిందన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రేమకు దూరమైన ఆమె మరో వ్యక్తితో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా అతనితో రిలేషన్ గురించి ఓపెన్ కానీ శ్రుతి ఇప్పుడు ఓపెన్ అయింది. ఆ వివరాలు..

పీకల్లోతు ప్రేమలో
ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సులే అనే అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిన శృతి హాసన్ ఇక అతనినే పెళ్లి చేసుకుంటుందని, సినిమాలకు సైతం దూరం అయిపోతుంది అని అందరూ భావించారు. దానికి ఊతం ఇచ్చే విధంగా ఆమె అతనిని ఇండియా తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు సైతం పరిచయం చేసింది. ఇక పెళ్లి చేసుకోవడం కన్ఫామ్ అని అందరూ ఫిక్స్ అయ్యాక అనూహ్యంగా వాళ్ళిద్దరూ విడిపోయారు.

ఒక ఆర్టిస్ట్ తో సన్నిహితంగా
ఇక చాలా కాలం ఆ ప్రేమ తాలూకు డిప్రెషన్ లోనే ఉండి పోయిన శృతి దాన్ని దాటుకుని సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్, క్రాక్ లాంటి సినిమాలతో మళ్లీ హిట్ అందుకొని ఫామ్ లోకి వచ్చింది. ఈ సమయంలో ఆమె మరో వ్యక్తితో డేటింగ్ చేస్తూ ఆసక్తికరంగా వార్తల్లోకెక్కింది. గత కొద్ది రోజులుగా శృతిహాసన్ శంతను హజారికా అనే ఒక ఆర్టిస్ట్ తో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే.. అయితే వీరిద్దరి మధ్య బంధం ఏమిటి అనేది మాత్రం సరైన క్లారిటీ ఆమె ఇవ్వడం లేదు.

ప్రేమికులుగా ప్రకటించుకున్నట్టు
అయితే తాజాగా శృతి హాసన్ మరియు ఆమె ప్రియుడు శాంతను హజారికా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో క్విజ్ తీసుకున్నారు, అందులో వారు తమకు ఒకరి గురించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తమ రిలేషన్‌షిప్‌లో 'ఐ లవ్ యూ' అని మొదట చెప్పింది తానేనని ఆ వీడియోలో శృతి వెల్లడించింది. ఇద్దరిలో ఎవరు ఒక రక్షణగా ఉన్నారు అని అడిగినప్పుడు, శృతి మరియు శాంతను ఒకరినొకరు చూపించుకున్నారు. వీరిద్దరూ రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు, ఇప్పుడు ఒకరికరంగా వీరు ప్రేమికులుగా ప్రకటించుకున్నట్టు అయింది.

ఎక్కువగా తింటాడని
శృతి హాసన్ మరియు శాంతను హజారికా తరచుగా Instagram లో ఫన్నీ ఫోటోలు మరియు వీడియోలను పంచుకుంటారు. వారు జనవరి 2021లో తాము కలిసి ఉంటున్నామని విషయాన్ని గురించి పబ్లిక్‌గా చెప్పారు. వారు తరచుగా డేట్ కు, ఆర్ట్ ఎగ్జిబిషన్‌లను సందర్శిస్తారు. ఇక తాజా వీడియోలో శృతి, శాంతనులలో శృతి ఎక్కువగా శుభ్రం చేస్తుందని మరియు శాంతను ఎక్కువగా తింటాడని వెల్లడించారు. శ్రుతి సోదరి అక్షర పోస్ట్‌పై స్పందిస్తూ, "నిజంగా గుడ్ మార్కింగ్ అని చెబుతూ నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్ చేసింది.

వరుస సినిమాలు
ఇక సినిమాల విషయానికి వస్తే గత ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న శృతి, తాజాగా హిట్ గా నిలిచిన వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాలో పవన్ భార్యగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. మరో పక్క పాన్-ఇండియా ప్రాజెక్ట్ సలార్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది. మెగాస్టార్ సరసన కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికయిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











