ప్రభాస్ పెళ్లిపై పెద్దమ్మ క్లారిటీ.. అమ్మవారి సన్నిధిలో శ్యామలదేవి గుడ్ న్యూస్!
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎన్నో ఏండ్లుగా ఓ తీరని లోటు ఉంది. అలాగే వారి మదిలో సమాధానం దొరకని ఓ చిక్కు ప్రశ్న కూడా ఉంది. అయితే.. ఆ సమాధానం దొరకని ప్రశ్నపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. రెబల్ స్టార్ ఫ్యాన్ తీరని కోరిక కూడా త్వరలో తీరబోతుంది. ఈ సమస్యలన్నింటికి రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామల దేవి ఓ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ సమస్య ఏంటీ? అనుకుంటున్నారా? అయితే.. ఓ లూక్కేయండి.
యంగ్ రెబల్ స్టార్ మిడిల్ ఏజ్ కి వచ్చేశారు. నాలుగుపదుల వయసు దాటారు. తన కెరీర్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా రెబల్ స్టార్ అనే పిలిచే స్టేజ్ కు వచ్చారు. కేరిర్ పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ప్రభాస్.. తన పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా వెనుకబడిపోయాడనే చెప్పాలి. ఇప్పటికే తన ఏజ్ గ్రూప్ నటులు పెళ్లిళ్లు చేసుకుని,పిల్లలను పట్టుకుని తిరుగుతారు. కానీ, ప్రభాస్ మాత్రం ఏక్ నిరంజన్ లాగా ఉండిపోయాడు.

ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభాస్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున జరిగింది. ఎన్నో రూమర్లు కూడా నెట్టింట్లో తెగ వైరలయ్యింది. కానీ, ఏవీ కూడా నిజం కాలేదు.పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి చేయాలని చాలా కలలు కన్నారు. కానీ, ఆ కల నెరవేరక ముందే ఆయన కాలం చేశారు. ప్రభాస్ తండ్రికి కూడా కాలం చేసారు. ప్రభాస్ కు పెద్ద దిక్కుగా కృష్ణంరాజు భార్య శ్యామల దేవీ ఉన్నారు.
అసలేం జరిగిందో సరిగా తెలియదు. కానీ, ప్రభాస్ తన జీవితంలో పెళ్లి అనే అంకానికి మాత్రం చాలా దూరమే ఉన్నారనీ,ఇంతకీ ఆయన పెళ్లి చేసుకుంటాడా లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తుంటే.. ఆయన ఫ్యాన్స్ మాత్రం ..ప్రభాస్ పెళ్లి చేసుకుంటారా ? లేదా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ విషయంకపై కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి కీలక ప్రకటన చేసింది. దసరా పండుగ, దేవి నవరాత్రుల నేపథ్యంలో విజయవాడ దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న శ్యామాల దేవీ సన్నిధానంలో ప్రభాస్ పెళ్లి గురించి మీడియా తో మాట్లాడింది.

శ్యామలాదేవి మాట్లాడుతూ.. అమ్మ ఆశీస్సులు ఉన్నాయి. పెదనాన్న కృష్ణం రాజుగారి ఆశీస్సులు కూడ ప్రభాస్ కు ఎప్పుడూ ఉంటాయి. త్వరలోనే పెళ్లవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. మీరే చూస్తారు. మీడియాను ఆహ్వానిస్తాం. అంటూ కీలక ప్రకటన చేసింది. ఇలా విజయవాడ అమ్మవారి సన్నిధిలో శ్యామలాదేవి .. ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్థావించారు. కాబట్టే ఈ ప్రభాస్ పెళ్లి ఖాయమేనంటూ రెబల్ ఫ్యాన్స్ పుల్ ఖుషి అవుతున్నారు. మరీ ప్రభాస్ తన పెళ్లి గురించి ఎలాంటి స్పష్టత ఇస్తాడో వేచి చూడాలి. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











