మళ్లీ టాలీవుడ్ పై సిద్ధు దండయాత్ర... మల్టీస్టారర్ తో రీ ఎంట్రీ

బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను బుట్టలో పడేసుకున్న సిద్ధార్ధ, ఆతరువాత అనుకోని విధంగా తెలుగు చిత్ర సీమకు దూరమైన సంగతి తెలిసిందే. అడపాదడపా డబ్బింగ్ సినిమాల ద్వారా మనోళ్లను పలుకరిస్తూనే ఉన్నా, వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోవాడం లేదు. ఇక ఇలా లాభం లేదని భావిస్తున్న సిద్ధూ మరోసారి డైరెక్ట్ గా అటాక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

RX100 డైరెక్టర్ అజయ్ భూపతి శర్వానంద్ తో ఓ భారీ మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మహా సముద్రం అన్న ఇంట్రెస్టింగ్ టైటిల్ తో మన ముందుకు రాబోతున్న ఈ సినిమాలోనే సిద్ధార్ధ్ మరో లీడ్ గా కనిపించబోతున్నాడట. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా సిద్ధూ మరోసారి టాలీవుడ్ జనాల మనసులు గెలుచుకోవాలని పరితపిస్తున్నాడు.

Siddaarth to work in Tollywood again, To star in Mahaa Samudram

తొలుత సిద్ధార్ధ పాత్రకు మాస్ మహారాజ్ రవితేజను అనుకున్నాడట డైరెక్టర్ అజయ్. కానీ, డేట్లు సర్దుబాటు చేయలేక రివితేజ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. మరోవైపు టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థకు ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ బాగా నచ్చేయడంతో వెంటనే ఓకే చేసేశాడట.

ఇక ఇప్పటికే శర్వానంద్ కు జోడీగా ఐశ్వర్యా రాజేశ్ ఎంపికైన సంగతి తెలిసిందే. మరోవైపు సిద్ధార్ధకు జోడీగా సాయి పల్లవిని అనుకుంటున్నారని తెలుస్తోంది. అనిల్ సుంకర నిర్మాణ సారధ్యంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతోంది. మరి.. చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న సిద్ధు, మరోసారి అదే రీతిన మెప్పిస్తాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X